తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో ఇన్ఫినిక్స్ పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు కూడా యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 10 పేరిట ఆ ఫోన్ భారత్‌లో విడుదలైంది. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఇన్పినిక్స్ హాట్ 10 స్మార్ట్ ఫోన్లో 6.78 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో లభిస్తుంది. వెనుక వైపు 16, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. బ్లూటూత్ 5.0 ఉంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది.
ఇన్పినిక్స్ హాట్ 10 స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.