ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సంస్థ ఎస్బీఐతో కలిసి కొత్తగా ఓ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. రుపే ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. ఇది కాంటాక్ట్ లెస్ కార్డు కావడంతో కార్డును మాటి మాటికీ తీయాల్సిన పని ఉండదు. ఫోన్ లో ఉండే ఎన్ఎఫ్సీ సహాయంతో కార్డు వివరాలను ఫోన్లో స్టోర్ చేస్తే ఇక మర్చంట్ల వద్ద ఫోన్‌ను చూపించి దాంతోనే ఈ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అలాగే రైల్వే టిక్కెట్లు, ఇతర బుకింగ్స్ చేయవచ్చు.
ఐఆర్సీటీసీ-ఎస్బీఐ నూతన క్రెడిట్ కార్డు రైల్వే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్డు ద్వారా రైల్వే ప్రయాణికులు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చన్నారు. తరచూ రైలు ప్రయాణం చేసేవారికి ఈ కార్డు బాగా పనిచేస్తుందని తెలిపారు.
One Credit Card, Multiple Benefits: Introducing IRCTC-SBI Cobranded RuPay Card, that lets you earn rewards while you spend.
Discover never-ending benefits on shopping, fuel recharge, train ticket booking & more!
? Apply today & enjoy zero issuance fee: https://t.co/aDDkqEElid pic.twitter.com/yQjX3guzGL
— Piyush Goyal (@PiyushGoyal) August 27, 2020
ఐఆర్సీటీసీ-ఎస్బీఐ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు ద్వారా కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
* కార్డును మొదటగా తీసుకున్న తరువాత రూ.500 లేదా అంతకన్నా ఎక్కువగా కార్డుతో ఖర్చు చేస్తే 350 బోనస్ రివార్డు పాయిట్లు ఇస్తారు.
* ఐఆర్సీటీసీ వెబ్సైట్లో చేసే టిక్కెట్ బుకింగ్స్ పై 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు.
* 1 శాతం వరకు ట్రాన్సాక్షన్ ఫీజు మాఫీ చేస్తారు.
* రైల్వేస్టేషన్లలో ప్రీమియం లాంజ్‌లలోకి ఎంట్రీ లభిస్తుంది.
* ఏ పెట్రోల్ పంపులో అయినా సరే ఫ్యుయల్ కొట్టిస్తే 1 శాతం ఫ్యుయల్ సర్‌చార్జి మాఫీ చేస్తారు.
* ట్రెయిన్ టిక్కెట్ల కొనుగోలుపై ప్రతి రూ.100కు 10 రివార్డు పాయింట్లు ఇస్తారు.
* ఇతర కొనుగోళ్లు చేస్తే ప్రతి రూ.125కి 1 రివార్డు పాయింట్ ఇస్తారు.
* కాంటాక్ట్ లెస్ కార్డు కనుక పీవోఎస్ మెషిన్‌పై కార్డును ఉంచితే ఆటోమేటిగ్గా ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. లేదా కార్డు వివరాలను ఫోన్లో స్టోర్ చేసి దాంట్లో ఉండే ఎన్ఎఫ్సీ ద్వారా కూడా పేమెంట్లు చేయవచ్చు. దీంతో కార్డు పోతుందని, కొట్టేస్తారని భయం ఉండదు.