IT Jobs: ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది తీపి కబురు..!!

Share

IT Jobs: దేశంలో పేరొందిన ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షలాది మంది ఫ్రెషర్స్ ను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్  పెరుగుతుండటంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. ఈ నాలుగు కంపెనీలు ఈ ఆర్థిక ఏడాదిలో 1.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. ఐటీ రంగంలో దాదాపు లక్షా 15వేల ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం కంపెనీల్లో ఉద్యోగుల అవకాశాలు పెరుగుతుండటంతో భారీగా నియామకాలు చేపట్టాలని చూస్తున్నాయి.

IT Jobs for freshers
IT Jobs for freshers

Read More: Family Drama: సుహాస్ కొత్త సినిమా “ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ వైరల్..!!

సీనియర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటే ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ నిపుణులకు ఉద్యోగం మారితే కనీసం 70 శాతం వేతనం ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ మేలు అన్న భావతో కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దానికి తోడు ఐటీ  కంపెనీలు భారీ ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. టీసిఎస్ ఫ్రూడెన్షియల్ ఫైనాన్సియల్ డీల్, ఇన్ఫోసిస్ డైమ్లెర్ కాంట్రాక్ట్, విప్రో మెట్రో ఏ జీ నుండి  డీల్ కుదుర్చు కున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి గత నెల వరకూ ఈ ప్రముఖ కంపెనీలు దాదాపు 48వేలకు పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. టీసీఎస్ గత సంవత్సరం 40వేల మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు ఇవ్వగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని భావిస్తున్నది.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఫ్రెషర్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి.


Share

Related posts

బిగ్ బాస్ హౌస్ లో ఆ టాప్ కంటెస్టెంట్ పై ఆర్జీవి లేటెస్ట్ కామెంట్స్..!!

sekhar

బాలయ్య-బోయపాటి సినిమాలో ఆ హీరోయిన్ ఆ ..?

GRK

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ కస్టమర్లూ.. జాగ్రత్త.. 3 రోజులే అందుకు గడువుంది..!

Srikanth A