Pegasus Hacking: దీదీ డేరింగ్‌… పెగాస‌స్‌ హ్యాకింగ్ సంగ‌తి తేల్చేందుకు క‌మిటీ

Share

Pegasus Hacking:ఓ వైపు పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతుంటే మ‌రోవైపు పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా అన్ని ప్ర‌ధాన పార్టీలు ఈ ఉదంతంపై స్పందిస్తున్నాయి. అయితే, ఈ విష‌యంలో బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ పై విచారణకు ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

Read More: Modi: మోడీ పై విరుచుకుప‌డే ఏ చాన్స్ వ‌దులుకోని మ‌మ‌త‌


మోడీ స‌ర్కారు ఏమీ చేయ‌ట్లే…
దేశ వ్యాప్తంగా విపక్ష నేతలు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, హక్కుల సంఘ నేతల తదితర వందలాది నేతల ఫోన్ లను హ్యాక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హ్యాకింగ్ కు గురైన వారి లిస్టులోమమత మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ప్రముఖంగా విన్పించింది. ఈ ప‌రిణామంపై టీఎంసీ ఘాటుగానే స్పందించింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ను వేస్తుందని తాము భావించామని.. అయితే కేంద్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనిమమతా బెనర్జీ విమర్శించారు. దీంతో తామే విచారణ కమిషన్ ను వేస్తున్నామని చెప్పారు.

Read More : KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండ‌రాం

మొద‌టి నిర్ణ‌యం ఆమెదే..
సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి మదన్ లోకే ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని నియమిస్తున్న‌ట్లు మ‌మ‌త బెన‌ర్జీ ప్ర‌క‌టించారు.తాము వేసిన ఈ చిన్న అడుగు ఇతరులను కూడా మేల్కొలుపుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ లో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని చెప్పారు. కాగా, పెగాసిస్ వ్యవహారంలో మొదటి అధికారిక విచారణ కమిటీ ఇదే. ఈ నేప‌థ్యంలో స‌హ‌జంగానే మ‌మ‌త నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది.


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 6th ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

‘పెంగ్విన్ ‘లెక్కలు తారుమారు ! తెగ చూసేస్తున్నారు !!

Yandamuri

ఇది జగన్ మార్క్ మాస్టర్ స్ట్రోక్ !చంద్రబాబు కంచుకోట బద్దలైంది !!

Yandamuri