ఇండియన్ మార్కెట్లో బాగా పరిచయమున్న నోకియా సంస్థ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. అందులో భాగంగా తయారుచేసిన స్మార్ట్ టీవీ ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ కంపెనీ ఇండియా మార్కెట్ లో ప్రారంభించిన రెండో స్మార్ట్ టీవీ అవుతుంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ని బిల్డ్ క్రోమ్ కాస్ట్ తో 43 అంగుళాల టీవీ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టీవీకి సంబంధించిన సేల్ “ఫ్లిప్ కార్ట్” లో జూన్ 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టీవీ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి ఉంది.
ఫ్యూచర్ వివరాలు: ఈటీవీ ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారితంగా పనిచేశాల చేశారు. వై ఫై – బ్లూటూత్, హెచ్ డి యూఎస్బీ, ఇంటర్నెట్, డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ తో వినియోగదారుల ముందుకు ఈ టీవీ రాబోతుంది. అంతేకాకుండా నెట్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫ్యూచర్ స్మార్ట్ టీవీ, నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ వంటి ఫ్యూచర్స్ కూడా ఈ టీవీ కి సపోర్ట్ చేస్తుంది.
ధర – ఆఫర్స్: ఈ టీవీ ధర కేవలం రూ. 31999 గా నిర్ధారించింది కంపెనీ. ఈ టీవీని ఆన్ లైన్ లో సిటీ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ. 1500, బ్యాంక్ బజార్ క్రెడిట్ కార్డు ద్వారా 10 శాతం తగ్గింపు లభించుకునే అవకాశం కలిగించింది. అంతేకాకుండా ఆరు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఉచితంగా అందించబడుతుంది.
స్పెసిఫికేషన్స్: ఇందులో 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, 3840 × 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, ఎంఈఎంసీ టెక్నాలజీ, డాల్బీ విజన్, ఇంటెలిజెంట్ డిమ్మింగ్, 2.25 జీబీ ర్యామ్, 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్, 16 జీబీ స్టోరేజ్ లాంటి అదిరిపోయే అనేక స్పెసిఫికేషన్లు ఉన్నాయి!