తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడంలో ఒప్పో కంపెనీ కూడా పేరుగాంచింది. ఆ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లతో ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఒప్పో మరొక స్మార్ట్ ఫోన్‌ను ఎ15 పేరిట విడుదల చేసింది. ఈ ఫోన్ ధర తక్కువగా ఉండడం విశేషం. ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
ఒప్పో ఎ15 స్మార్ట్ ఫోన్లో.. 6.55 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 3జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను దీంట్లో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లో రెండు 4జి సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో ఫీచర్లు లభిస్తాయి. 4230 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
ఒప్పో ఎ15 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,990గా ఉంది. అమెజాన్‌లో దీన్ని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.