ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న చైనా మొబైల్ కంపెనీ ఒప్పో 5G స్మార్ట్ ఫోన్ నూతన మోడళ్లను విడుదల చేసింది. అవే రెనో 5- 5G, రెనో 5 ప్రో- 5G ఈ రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది ఒప్పో.పేరుకు తగ్గట్టుగానే ఈ మోడళ్లు 5G కనెక్టివిటీ సదుపాయం ఉండడంతో పాటు సూపర్ పనితీరు కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్లతో మార్కెట్లలోకి విడుదలయ్యాయి. ఈ సిరీస్ లోని మరో రెనో 5 ప్రో + ఫోన్ కూడా త్వరలోనే విడుదల అవనున్నట్టు సమాచారం. వాటి ధరలు, ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
ఒప్పో రెనో 5 5G స్మార్ట్ ఫోన్ 6.43-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఒప్పో రెనో 5 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 6.55-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేతో విడుదలైంది. కెమెరా విషయానికొస్తే ఒప్పో రెనో 5 5Gకి ముందు ఒకే కెమెరా, ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంది. వెనుక ఉన్న కెమెరాలలో 64MP లెన్స్ తో ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో సెకండరీ కెమెరా, 2MP మాక్రో షూటర్ మరియు 2MP పోర్ట్రెయిట్ షూటర్‌తో రెండు సెన్సార్ కెమెరాలు జత చేయబడి ఉంటాయి. వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP లెన్స్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో 4,300mAh బ్యాటరీ ఇన్ బిల్ట్ చేయబడింది.
5G ఫోన్ గా విడుదలైన ఈ ఒప్పో రెనో 5- 5G ఫోన్ ఒకటి 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ గా, రెండవది కాగా టాప్ మోడల్ గా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ నిర్ణయించారు. మొదటిదాని ధర రూ.30,400, టాప్ మోడల్ రూ.33,700లకు లభించనుంది. అలాగే మరోవైపు ఒప్పో రెనో 5 ప్రో 5G కూడా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ లలో అందుబాటులో ఉంది. మొదటి మోడల్ ధర రూ.38,200, 12 GB ర్యామ్ కలిగి ఉన్న ఫోన్ ధర రూ. 42,700లకు లభించనుంది. ఈ రెండు ఫోన్లను అరోరా బ్లూ, స్టార్రి నైట్ తో పాటు మూన్లైట్ నైట్ కలర్లతో విడుదల చేశారు.