మీ పాన్‌ కార్డులో త‌ప్పులున్నాయా? అయితే ఇంటి నుంచే స‌రిచేసుకోండి ఇలా!

ప్ర‌భుత్వం అందిస్తున్న గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు, ఓట‌ర్ ఐడీ కార్డు, పాన్‌కార్డులు చాలా ముఖ్య‌మైన‌వి. ఇప్ప‌టికే అధార్ కార్డు, ఓట‌ర్ కార్డుల‌కు సంబంధించిన మార్పులు చేర్పుల విష‌యంలో ప్రజలకు ఆన్ లైన్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. వాటిల్లోని త‌ప్పుల‌ను ఇంటి నుంచి ప‌లు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయ‌డం ద్వారా అన్ లైన్ స‌ర్వీసుతో స‌రిచేసుకోవ‌చ్చు.

అయితే, పాన్‌కార్డు చాలా ముఖ్య‌మైన‌దే.. ఎందుకంటే… చాలా చోట్ల పాన్‌కార్డు అవ‌స‌ర‌మ‌వుతుంది. ముఖ్యంగా బ్యాంకౌంట్‌కు తీసుకోవ‌డానికి, అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వ‌హించాలంటే పాన్‌కార్డు త‌ప్ప‌నిస‌రి. అలాగే, ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖాలు చేయ‌డానికి, క్రెడిట్‌లోనూ తీసుకోవ‌డానికి, జీఎస్టీ వంటి సేవ‌లు పొంద‌డానికి పాన్‌కార్డు త‌ప్ప‌నిస‌రి. అయితే, ఈ కార్డుల్లో త‌ప్పులు ఉంటే .. వాటిని స‌రిచేసుకోవ‌డానికి ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు ఇప్పుడు.. కేవ‌లం ఒక్క క్లిక్‌తో మీరున్న చోటునుంచే పాన్ కార్డులోని త‌ప్పుల‌ను స‌రిచేసుకోవ‌చ్చు !

పాన్‌కార్డు వివ‌రాల‌ను ఎలా అప్ డేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ! ముందుగా మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్‌లో ఎదైనా బ్రౌస‌ర్ ను ఒపెన్ చేయండి. ఇప్పుడు సెర్చ్ బార్‌లో ఎన్ ఎస్ డీ ఎల్ టైప్ చేసి ఎంట‌ర్ నొక్క‌డి. అందులో మీకు మొద‌టిలింక్ ఎన్ఎస్‌డీఎల్ పాన్ కార్డు అన్‌లైన్ స‌ర్వీస్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేయ‌గానే ఎన్ఎస్‌డీఎల్ మెయిన్ సైట్ ఒపెన్ అవుతుంది. అందులో స‌ర్వీస్ ట్యాబ్ క్లిక్ చేసి పాన్‌కార్డు అప్ష‌న్ ఎంచుకోండి.

ఆ తర్వాత పాన్‌కార్డు వివ‌రాల మార్పు అప్ష‌న్ ఎంచుకోండి. దాన్ని క్లిక్ చేయ‌గానే ఓ అప్లికేష‌న్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ కార్డు వివ‌రాలు ఎంట‌ర్ చేయ‌డంతో పాటు ఈ కేవైసీని పూర్తిచేయాలి. ఈ త‌ర్వాత స‌ర్వీసు ఛార్జీలను పేమెంట్ చేసి.. సంబంధిత డాంక్యుమెంట్ల‌ను ఎన్ఎస్‌డీఎల్ ఆఫీసుకు పంపించాలి. దీంతో మీ పాన్ కార్డులోని వివ‌రాలు అప్‌డేట్ అవుతాయి.