Phone Hacking: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తరచు వెంటాడుతున్న భయం హ్యాకింగ్. మనకు తెలియకుండానే సైబర్ కేటుగాళ్లు మన ఫోన్ లోని డేటాను దొంగతం చేస్తుంటారు. అంతే కాకుండా మనకు తెలియకుండానే ఫోన్ కెమెరా, మైక్రో ఫోన్ కూడా అన్ అవుతుంటాయి. కేవలం ఒకే ఒక మిస్ట్ వీడియో కాల్ ద్వారా కూడా ప్రమాదకరమైన పెగాసస్ వంటి స్ర్పైవేర్ టూల్స్ ను మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేయవచ్చు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడినట్లు ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అధికార విపక్షమనే తేడా లేకుండా చాలా మంది బాధితులు ఇందులో ఉన్నారు. పెగాసస్ వంటి స్ర్పైవేర్ టూల్స్ వినియోగదారులకు తెలియకుండానే ఫోన్ లో ఇన్ స్టాల్ అయిపోతాయి. ఒక సారి ఇన్ స్టాల్ అయ్యాక ఫోన్ కు సంబంధించిన డేటా మొత్తం ఎటాకర్ కు పంపడం మొదలు పెడుతుంది. వ్యక్తిగత డేటాతో పాటు పాస్ వర్డ్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈ మెయిల్స్ తో పాటు లైవ్ వాయిస్ కాల్స్ ను కూడా ఇవి ట్రాక్ చేయగలవు.
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయితే ఏమి చేయాలి
స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. దీని వల్ల మన ఫోన్ పై జరిగే ఎటాక్ లను 90 శాతం నిరోధించవచ్చు. స్ర్పేవేర్ టూల్ మన ఫోన్ లోకి వచ్చిన తరువాత కూడా ఫోన్ సాధారణంగానే పని చేస్తుంటుంది. అయితే ఇవి స్మార్ట్ ఫోన్ లో చొరబడిన విషయాన్ని నిర్ధారించేందుకు ఫొరెన్సిక్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.
పెగాసస్, ఇతర సాఫ్ట్ వేర్ లు ఏ యాప్ ద్వారా మన ఫోన్ లలో ప్రవేశించాయనే విషయాన్ని ఇందులో పరిశీలిస్తారు. స్మార్ట్ ఫోన్ ను ఫొరెన్సిక్ పరీక్ష చేయిస్తే తప్ప అది హ్యాక్ అయిందీ లేనిది తెలియదు. ఒక వేళ మన ఫోన్ హ్యాక్ అయితే ఫోన్ ను, ఫోన్ నెంబర్ ను రెండింటినీ వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులు తెలుపుతున్నారు.