పోకో కంపెనీ పోకో సి పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో రెడ్మీ 9సి తరహా స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పోకో సి3 ఫోన్లో 6.53 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్సీడీ డిస్ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్ ఉంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.
పోకో సి3 ఫోన్‌కు ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 3, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో లభిస్తున్నాయి. 32 లేదా 64జీబీ స్టోరేజ్ కెపాసిటీలలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు సిమ్‌లు, ఒక మైక్రో ఎస్డీ కార్డును వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది.
డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0 తదితర ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్ కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7499 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8499గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్స్‌ను ఈ నెల 16 నుంచి విక్రయిస్తారు. అదే రోజు బిగ్ బిలియన్ డేస్ సేల్ ఉన్నందున ఎస్బీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్‌పై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.