మనిషి జీవితంలో టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. ఇటువంటి తరుణంలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు చీపెస్ట్ బెస్ట్ క్వాలిటీ తో రియల్ మీ స్మార్ట్ ఫోన్ సంస్థ అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో సెల్ ఫోన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. వాటి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. మార్కెట్లోకి ఇప్పటికే రియల్ మీ తన రియల్ మీ 5, రియల్ మీ 5ఎస్ స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ 1.0 అప్ డేట్ ను సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కు ఇప్పటికే మే సెక్యూరిటీ ప్యాచ్ ను అందించారు. ఫోకస్ మోడ్, ఆప్టిమైజ్డ్ స్క్రీన్ షాట్, కెమెరా యూజర్ ఇంటర్ ఫేస్ లో కూడా కొన్ని మార్పులు అందించారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్ల వివరాలు మీకోసం…..
రియల్ మీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!
6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే,
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా,
2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సూపర్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్ కెమెరాని అందించారు.
13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఇంకా రియల్ మీ 5 ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్!
6.5 ఇంచెస్ హెచ్ డీ+ డిస్ ప్లే,
మెయిన్ కెమెరా 13 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్,
సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సెల్,
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది.