NewsOrbit
Featured టెక్నాలజీ

రియ‌ల్‌మి నుంచి 7ఐ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..!

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియ‌ల్‌మి 7ఐ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో బుధ‌వారం విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే రియ‌ల్‌మి 7, 7ప్రొ ఫోన్లు విడుద‌ల కాగా ఆ సిరీస్‌లో ఈ ఫోన్ కొత్త‌గా విడుద‌ల కావ‌డం విశేషం. దీంట్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

Realme 7i smart phone launched in india

రియ‌ల్‌మి 7ఐ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లే. హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. అలాగే డిస్‌ప్లేకు గొరిల్లాగ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అందిస్తున్నారు. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫొటోలు క్వాలిటీగా వ‌స్తాయి.ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. మెమొరీ కార్డు కోసం ప్ర‌త్యేకంగా స్లాట్‌ను ఇచ్చారు. రెండు సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఇందులో ల‌భిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు.

రియ‌ల్‌మి 7ఐ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌ను అక్టోబ‌ర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

author avatar
Srikanth A

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

Deepak Rajula

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

Best Family Plan Airtel & Jio: తక్కువలో ఇంట్లో అందరికి కలిపి ఒకటే రీఛార్జ్ ఉంటె బాగుండు అనుకుంటున్నారా… అయితే జియో ఎయిర్టెల్ బెస్ట్ ఫామిలీ ప్లాన్స్ చూడండి!

Deepak Rajula

WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ ఛానెల్ వల్ల ఉపయోగాలు.. వాట్సాప్ ఛానల్ కు, టెలిగ్రామ్ ఛానెల్‌కు ఉన్న తేడా ఇదే!

siddhu

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Deepak Rajula

Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?

Deepak Rajula

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

sekhar

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

sharma somaraju

Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే,  కాలి బూడిదై పోదా ??

sharma somaraju