తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో రియల్‌మి పేరుగాంచింది. ఈ క్రమంలోనే రియల్‌మి ఇప్పటికే అలాంటి ఎన్నో ఫోన్లను విడుదల చేసింది. తాజాగా సి15 క్వాల్కామ్ ఎడిషన్ పేరిట మరొక ఫోన్‌ను విడుదల చేసింది. దీంట్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
రియల్‌మి సి15 క్వాల్కామ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లో 6.52 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్ డిస్ప్లేకు అందిస్తున్నారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఇందులో ఉంది. 3, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 32, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో రెండు సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ రెట్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ మోనో కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ పనిచేస్తుంది. బ్లూటూత్ 5.0 ఉంది. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
రియల్‌మి సి15 క్వాల్కామ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 ఉంది. దీపావళి పండుగ సందర్భంగా వీటిని రూ.500 తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.