గాల్వాన్ లోయలో చైనా సైనికులు భారత్ ఆర్మీ కి చెందిన 20 మంది సైనికులను దారుణంగా చంపడంతో దేశంలో చైనాపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. చైనా వస్తువులను నిషేధించాలని ప్రజలు చాలా వరకు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇటువంటి తరుణంలో భారత్ ప్రభుత్వం దేశంలో వస్తున్న ఒత్తిడి తో అదేవిధంగా దేశ రక్షణ దృష్ట్యా భద్రత విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా చైనా దేశానికి చెందిన 59 యాప్ లు ఇండియా దేశం నిషేధం విధించడం జరిగింది.
నిషేధించిన వాటిలో భారతీయులు ఎంతగానో అలవాటుపడ్డ ‘టిక్ టాక్’ యాప్ కూడా ఉండటంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. అంతే కాకుండా ఆ తర్వాత టిక్ టాక్ లాంటి యాప్ కోసం ప్రజలు చాలా సెర్చ్ చేయడం జరిగింది. అటువంటి యాప్ సేమ్ టిక్ టాక్ లాంటిది మరొకటి ఇటీవల లాంచ్ అయ్యింది. అదే ‘టకాటక్’ యాప్. ప్రముఖ మీడియా ప్లేయర్, స్ట్రీమింగ్ యాప్ ఎంఎక్స్ ప్లేయర్ ఎంఎక్స్ ‘టకా టక్’ పేరుతో యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ సేమ్ టు సేమ్ ‘టిక్ టాక్’ మాదిరిగానే పని చేస్తోంది. పేరు మొదలుకొని వీడియోలు వరకు దాదాపు ‘టిక్ టాక్’ యాప్ ను పోలి ఉంది. చాలామంది ‘టిక్ టాక్’ కి అలవాటు పడిన వారు రికార్డు స్థాయి లో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.