NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

Price Hike : ఏప్రిల్ నుంచి బాదుడే!!

Price Hike: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి చాలా వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ తదితర వస్తువులను పెంచేస్తున్నాయి వ్యాపార సంస్థలు. ఇక వేసవి కాలం ఉండటంతో ఏసీలు, టీవీల ధరలు పెరగనున్నాయి. పలు ఉత్పత్తులలో ఉండే ముడిసరుకు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ప్రజలపై మోపనున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ కారణంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

Price Hike
Price Hike

ఏసీలు, టీవీల తయారీకి కావాల్సిన విడిభాగాలు భారత్‌కు దిగుమతిలో ధరలు పెరగడంతో ఏప్రిల్‌ నుంచి సదరు సంస్థలు ధరలు పెంచనున్నాయి. మరోవైపు దిగుమతి చేసుకునే విడిభాగాలపై కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో కస్టమర్స్ డ్యూటీ పెంచింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఏసీల ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. ఒక ఏసీకి రూ.200 నుంచి రూ.1,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం కలిపి కనీసం 3 శాతం నుంచి 5 శాతం వరకు ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఏసీలు మాత్రమే కాదు… రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టైట్స్‌, మొబైల్‌ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీవీల ధరలు మరింత ప్రీయం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టీవీల ధరలు కనీసం రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక టీవీ ధర రూ.3,000 నుంచి రూ.4,000 పెరిగింది. టీవీ ప్యానెల్ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు కస్టమ్ డ్యూటీ పెరిగింది. వీటితో పాటు కాపర్, అల్యూమినియం, స్టీల్ లాంటి ఇన్‌పుట్ మెటీరియల్ ఛార్జీలు పెరిగాయి. రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇవన్నీ కలిసి టీవీల ధరలు పెరగడానికి కారణమవుతుంది.

కాగా, కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ పెంచడంతో వీటితో పాటు సోలార్‌ ఇన్వర్టర్లు, లాంతర్లు, ఆటో మొబైఔల్‌ పార్స్ట్‌, స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జర్లు, లిథియం ఇయాన్ బ్యాటరీ రా మెటిరీయల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్ నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ధరలు పెరిగేలా ఉన్నాయి. ఇలా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు మరింత భారం కానుంది. ఇప్పటికే మండిపోతున్న ధరలతో జనాలు అతలాకుతలం అవుతుంటే ఏప్రిల్‌ నుంచి మరికొన్నింటిపై ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవేకాకుండా వాహన రంగలో కూడా బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే సదరు వాహనాల తయారీ సంస్థలు ప్రకటించేశాయి.

author avatar
Comrade CHE

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju