వాట్సాప్‌లో ఉన్న మీకు తెలియ‌ని హిడెన్ ఫీచ‌ర్లు ఇవే..!

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తుంటుంది. ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల అద్భుత‌మైన ఫీచ‌ర్లు వాట్సాప్‌లో యూజ‌ర్లకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప‌లు ఫీచ‌ర్ల గురించి ఇప్ప‌టికీ కొంద‌రు యూజ‌ర్ల‌కు ఇంకా తెలియ‌దు. అలాంటి వారు కింద ఇచ్చిన ప‌లు వాట్సాప్ ఫీచ‌ర్ల గురించి తెలుసుకోవ‌చ్చు. దీంతో వాట్సాప్‌ను వాడ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది.

top hidden and unknown features in whatsapp

యానిమేటెడ్ స్టిక్క‌ర్లు…

వాట్సాప్‌లో చాలా మంది ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌ల‌ను, ఎమోజీల‌ను పంపుకుంటుంటారు. కానీ అందులో యానిమేటెడ్ స్టిక్క‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌లో ఎమోజీ షార్ట్‌క‌ట్‌ను ట్యాప్ చేసి అనంత‌రం వ‌చ్చే స్క్రీన్‌లో కింది భాగంలో ఉండే 3వ ఐకాన్‌ను ఎంచుకుంటే చాలు. వాట్సాప్ లో యానిమేటెడ్ స్టిక్క‌ర్ల‌ను పంపుకోవ‌చ్చు.

క్యూఆర్ కోడ్స్…

వాట్సాప్ లో కాంటాక్ట్‌ల‌ను యాడ్ చేయాలంటేనే ఇంత‌కు ముందు క‌ష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అందులో క్యూఆర్ కోడ్స్ ల‌భిస్తున్నాయి. ఎవ‌రైనా వ్య‌క్తికి చెందిన వాట్సాప్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌డం ద్వారా అత‌న్ని మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ చేయ‌వ‌చ్చు. అయితే మీ క్యూఆర్ కోడ్‌ను ఇందుకు ఇచ్చేట‌ప్పుడు మాత్రం జాగ్ర‌త్త వ‌హించాలి. కేవ‌లం తెలిసిన వారికి మాత్ర‌మే క్యూఆర్ కోడ్‌ను ఇవ్వాలి. లేదంటే మీ క్యూఆర్ కోడ్‌ను ఎవ‌రైనా ఉప‌యోగించి త‌ప్పుడు ప‌నులు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

మెసేజ్‌ల ఫార్మాటింగ్‌…

వాట్సాప్‌లో ఈ ఫీచ‌ర్ ఎప్ప‌టి నుంచో అందుబాటులో ఉంది. దీని వ‌ల్ల వాట్సాప్‌లో పంపుకునే టెక్ట్స్ సందేశాల్లోని ప‌దాల‌ను బోల్డ్‌, ఇటాలిక్‌, స్ట్రైక్ త్రూ, మోనో స్పేస్ టెక్ట్స్ లా మార్చుకోవ‌చ్చు. అందుకు ప‌లు కోడ్‌లు ఉంటాయి. ప‌దాల‌ను ఇటాలిక్ రూపంలో మార్చాలంటే _text_ అనే దాంట్లో టెక్ట్స్‌కు బ‌దులు ఏవైనా ప‌దాల‌ను ఉంచాలి. అలాగే ప‌దాల‌ను బోల్డ్‌గా చేయాలంటే *text* అనే ఫార్మాట్‌లో ప‌దాల‌ను పంపాలి. ఇక ప‌దాల‌ను స్ట్రైక్ త్రూగా మార్చాలంటే ~text~ అనే దాంట్లో టెక్ట్స్‌కు బ‌దులుగా ప‌దాల‌ను ఉంచాలి. ఇక మోనోస్పేస్‌గా మార్చాలంటే “`text“` అనే ఫార్మాట్‌ను ఉప‌యోగించాలి.

గ్రూప్ ప‌ర్మిష‌న్లు…

వాట్సాప్ గ్రూప్‌లలో ఉండే వారికి ప్ర‌త్యేకమైన ప్రైవ‌సీ ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వ‌ల్ల గ్రూప్‌లో రిసీవ్ చేసుకునే మెసేజ్‌ల‌పై పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ ల‌భిస్తుంది.

గ్రూప్ వీడియో కాల్స్‌…

వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఒకేసారి కాల్‌లో 8 మంది మాట్లాడ‌వ‌చ్చు.

టు స్టెప్ వెరిఫికేష‌న్‌…

మీ వాట్సాప్ అకౌంట్‌కు టు స్టెప్ వెరిఫికేష‌న్ ద్వారా మ‌రింత సెక్యూరిటీని క‌ల్పించుకోవ‌చ్చు. అందుకు గాను 6 అంకెల పిన్‌ను సెట్ చేసుకునే వీలు క‌ల్పించారు.

డార్క్ మోడ్‌…

వాట్సాప్ యాప్‌, వాట్సాప్ వెబ్‌ల‌లో డార్క్ మోడ్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. చీక‌టి ప్ర‌దేశాల్లో యాప్ ను వాడేట‌ప్పుడు దాన్ని డార్క్ మోడ్‌లో వాడుకోవ‌చ్చు. దాంతో క‌ళ్ల‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుంది.