Viral Video : సాధారణంగా మన కాలనీ లో కూరగాయల అమ్మే వాళ్ళు కూరగాయలమ్మ కూరగాయలు.. అంటూ అమ్ముకుంటారు..! కాస్త సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఆమె వస్తువులను పేర్లను రికార్డ్ చేసి మైకుల్లో చెబుతున్నారు.. ఎవరికి తోచిన విధంగా వారు కూరగాయలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.. తాజాగా ధన్ బాద్ కు చెందిన రితీష్ పాండే కూరగాయలు అమ్మే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ నగరం కు చెందిన రితీష్ పాండే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. అయితే రోజు ఒకే విధంగా కూరగాయలు అమ్మడం బోర్ కొట్టిందేమో డిఫరెంట్ గా ట్రై చేశాడు.. ఐడియా అదిరిపోయింది.. ఈయన కూరగాయలు అమ్మే స్టైల్ మాత్రం వెరైటీగా ఉంది. తన దగ్గర ఉన్న టేప్ రికార్డర్ లో దబాంగ్ సినిమాలోని చుల్ బుల్ పాండే గెటప్ లో ఉన్న సల్మాన్ ఖాన్ డాన్స్ చేసిన ‘ఆజావో బాయ్ సబ్జీ లేలో’ పాటను ప్లే చేసి దానికనుగుణంగా డాన్స్ చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాడు.. తలకు పాగా, సన్ గ్లాసెస్ పెట్టి రోడ్డుపై డాన్స్ చేస్తూ వచ్చి పోయే వారిని ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియోను ప్రేరణ శర్మ అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాండే ఒక్కసారిగా వైరల్ అయ్యాడు.. ఒకసారి మీరు ఈ వీడియో ని చూడండి.. అతని డ్యాన్స్ అదిరింది.
ये धनबाद के रहने वाले रितेश पांडेय हैं। सब्जी बेचते हैं। लेकिन इनके सब्जी बेचने का तरीका इतना अनोखा है कि इन्होंने सोशल मीडिया पर बवाल मचा दिया है। आपके घर में झोले भर सब्जी हो, इसके बावजूद अगर रितेश के ठेले से गुजरे तो बिना सब्जी खरीदे नहीं लौटेंगे।#Dhanbad #RiteshPandey pic.twitter.com/u3y3WUBkKD
— Prerna Sharma (@Kumariprerana12) March 20, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?