NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

మీ వాట్సాప్ ను హ్యాక్ చేయడం చాలా సులువు…! కానీ ఇలా తప్పించుకోండి

ఇటీవల చాలా వరకు హ్యాకర్లు సోషల్ మీడియా వినియోగదారుల అకౌంట్లను హ్యాక్ చేస్తూ రకరకాల దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో చాలామంది ఇళ్లలోనే ఉండటంతో…. ఆన్లైన్ ట్రాన్సక్షన్ లు ఎక్కువ జరగటంతో చాలామంది హ్యాకర్లు ఓటీపీ ని తెలుసుకొని వివిధ రకాల ఆర్థిక నేరాలకు పాల్పడిన ఘటన లకి సంబంధించిన కేసులు ఇటీవల చాలా వరకు నమోదయినట్లు వార్తల్లో బయట పడటం జరిగింది.

 

వాట్సాప్ అంటే.. డేంజరే మరి!

అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఉండే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిని హ్యాకర్లు హ్యాక్ చేయడం మనం విన్నాం. కానీ తాజాగా మనం నిత్యం వాడే వాట్సాప్ ని కూడా హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా సరికొత్త షాకింగ్ విషయం బయటపడింది. ఇటీవల మహారాష్ట్ర సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన కేసుల్లో చాలావరకూ వాట్సాప్ అకౌంట్ ను హ్యాకింగ్ చేసే హాకర్లు ఎక్కువైనట్లు షాకింగ్ విషయం బయటపడింది. వాట్సాప్ అకౌంట్ వినియోగదారుడు… అకౌంట్ వినియోగిస్తుండగా నే మరోపక్క హ్యాకర్ ఆ వాట్సాప్ ఎకౌంటు ని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్లు బయటపడింది.

ఇలా జరుగుతుంది…

క్షుణ్నంగా ఈ విషయంలోకి వెళ్తే వినియోగదారుడు ఎప్పుడైనా తన వాట్స్అప్ మొబైల్ ని చేంజ్ చేసినప్పుడు కొత్త ఫోన్ లో వాట్సాప్ వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా సదరు వినియోగదారుడి నంబర్ కి ఓటీపీ వస్తుంది. అంటే వన్ టైం పాస్ వర్డ్ అన్నమాట. ఆ ఓటిపిని సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ ని…. హ్యాకర్ తెలుసుకుంటే చాలు మిగతాదంతా చాటున ఉండి హ్యాకర్ తనపని తాను చేసుకుంటూ పోతాడు.
ఉదాహరణకు A అనే వ్యక్తి వాట్సాప్ ఎకౌంట్ హాక్ అయింది అనుకుందాం. ఏ అనే వ్యక్తికి వచ్చిన ఓటీపీ తెలుసుకుని అతని వాట్సాప్ ఎకౌంట్లో హ్యాకర్ ప్రవేశిస్తాడు. ఒకపక్క A అనే వ్యక్తి వాట్సాప్ వాడుతుండగా అనే మరో పక్క హ్యాకర్ కూడా A అనే వ్యక్తి యొక్క అకౌంట్ ని వాడి…. ఆ వ్యక్తి కి సంబంధించిన పర్సనల్ వీడియోలు, ఫొటోలను…. A అనే వ్యక్తి పర్సనల్ గా వేరే వ్యక్తితో చేసే చాటింగ్ తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాకర్ A అనే వ్యక్తిని బ్లాక్మెయిలింగ్ చేసి అనేక రీతులుగా ఆర్థికంగానూ మరో రకంగానూ మోసం చేయవచ్చని తాజాగా మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇదే రీతిలో ఏ అనే వ్యక్తి మరో B అనే వ్యక్తి తో ఎక్కువగా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే హ్యాకర్….. A అనే వ్యక్తి లాగా చాట్ చేసి ఏదో ఒక కట్టు కథ అల్లి…. ‘నీ ఓటిపి చెప్పు’ అంటూ, B అనే వ్యక్తి యొక్క ఓటిపి కూడా తెలుసుకొని అతని కాంటాక్ట్స్ తో కూడా ఆడుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించారు.

ఒకటే మార్గం… అప్పుడే భద్రం

ఈ విధంగా మీ వాట్సాప్ ఎకౌంటు హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే….. ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వన్ టైం పాస్ వర్డ్ (OTP) అనేది ఎవరికీ చెప్పకూడదు అని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరిస్తున్నారు. దానికి మించిన మార్గం లేదు.. అంతకన్నా సులువైన పని కూడా లేదు…. ఇక మీ ఇష్టం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju