WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది.. తాజాగా వాట్స్అప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.. వాట్సాప్ కొత్తగా “వ్యూ వన్స్” (View Once) అనే సరికొత్త మోడ్ ను యూజర్లకు పరిచయం చేయనుంది..
సాధారణంగా వాట్సప్ యూజర్ మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలను తమకు నచ్చిన వ్యక్తులకు పంపిస్తే వారికి రిసీవ్ అయ్యాక చూస్తారు.. అయితే మనం ఒక్కసారి పంపితే వాళ్లు ఎన్ని సార్లు అయినా ఆ ఫొటోలు, వీడియోలను చూడొచ్చు.. మనం పంపిన ఫోటోలు ఒక్కసారి మాత్రమే అవతలి చూస్తే చాలు ఆలోచన మనలో చాలామందికి వచ్చి ఉంటుంది.. ప్రస్తుతం వాట్స్అప్ తెచ్చిన “వ్యూ వన్స్” ఆప్షన్ ద్వారా మనం పంపిన మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు ఒకసారి మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. 2.21.14.3 ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఈ సదుపాయాన్ని వాట్స్అప్ అందిస్తుంది. అలాగే త్వరలోనే ఐఓఎస్ యూజర్లు కూడా అందుబాటులోకి తీసుకురానుంది.