Wifinanscan : గూగుల్ ప్లే స్టోర్ లో డెవలపర్ల కోసం Wifinanscan అనే యాప్ అందుబాటులోకి వచ్చింది.. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఇంటర్నెట్ కలెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవడానికి అనుమతి ఇస్తుంది.. అంతేకాదు ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చాలా పనులు చేసుకోవచ్చు. వైఫై అవేర్ ఉపయోగించి రెండు స్మార్ట్ఫోన్ ల మధ్య కచ్చితమైన దూరాన్ని కూడా కొలవచ్చు..
Wifinanscan ప్రత్యేకంగా డెవలపర్లు, విక్రేతలు , విశ్వవిద్యాలయాల కోసం టెస్టింగ్ సాధనంగా తయారు చేశారు ఈ యాప్ తో 1-15 మీటర్ల వరకు ఉన్న పరికరాల మధ్య కచ్చితమైన దూరాన్ని కూడా కొలవచ్చు.. డెవలపర్లు p2p రేంజ్, డేటా షేర్, వైఫై అవేర్ NAN API ఆధారంగా రెండు ఫోన్లు మధ్య దూరం కలవడానికి దీనిని ఉపయోగించవచ్చు. వైఫై అవేర్ నెట్వర్క్ కనెక్షన్ బ్లూటూత్ తో పోలిస్తే ఎక్కువ రేంజ్ కనెక్షన్ను అందిస్తుంది. ఫొటో షేరింగ్ తో పాటు వినియోగదారుల మధ్య పెద్ద మొత్తంలో డేటా పంచుకునేందుకు ఈ రకమైన కలెక్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లార్జ్ డేటా షేరింగ్ కోసం ఈ యాప్ ను ఉపయోగించవచ్చు.