ఎంఐ వాచ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 ల‌ను విడుద‌ల చేసిన షియోమీ..!

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ విడుద‌ల చేసే స్మార్ట్ వాచ్‌లు, బ్యాండ్‌లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఆ కంపెనీ తాజాగా ఎంఐ వాచ్ రివాల్వ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 పేరిట ఓ నూత‌న స్మార్ట్ బ్యాండ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వాటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

xiaomi launched mi smart band 5 and mi watch revolve

షియోమీ ఎంఐ వాచ్ రివాల్వ్ స్మార్ట్ వాచ్‌లో.. 1.39 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ఉంది. బ్లూటూత్ 5.0 ద్వారా క‌నెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు ఈ వాచ్‌ను క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. హార్ట్ రేట్ సెన్సార్‌, స్లీప్ ట్రాకింగ్‌, ఫిట్ నెస్ ట్రాకింగ్‌, 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, వాట‌ర్ రెసిస్టెన్స్‌, 14 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ వాచ్‌లో ల‌భిస్తున్నాయి. రూ.9,999 ధ‌ర‌కు ఈ వాచ్ అక్టోబ‌ర్ 6 నుంచి ల‌భిస్తుంది.

ఇక ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 లో.. 1.1 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. హార్ట్ రేట్ సెన్సార్‌, స్టెప్ కౌంట‌ర్‌, వెద‌ర్ ఫోర్ క్యాస్ట్‌, యాప్ నోటిఫికేష‌న్స్‌, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్‌, 24 అవ‌ర్ స్లీప్ ట్రాకింగ్‌, ఆటోమేటిక్ యాక్టివిటీ డిటెక్ష‌న్‌, సెడెంట‌రీ రిమైండ‌ర్‌, 11 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్స్ ఇందులో ల‌భిస్తున్నాయి. బ్లూటూత్ ద్వారా ఇత‌ర డివైస్‌ల‌కు దీన్ని క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. 14 రోజుల వ‌ర‌కు దీని బ్యాట‌రీ వ‌స్తుంది. ఈ బ్యాండ్ ధ‌ర రూ.2499గా ఉంది. అక్టోబ‌ర్ 1 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.