NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్ధులకు కరోనా.. భయాందోళనల్లో తల్లిదండ్రులు

Advertisements
Share

భారత్ లో మరో సారి కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తొంది. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తొంది. రాష్ట్రంలో కరోనా కేసులు లేవనీ, అయినా అప్రమత్తత అవసరమని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్న 24 గంటల వ్యవధిలోనే ఒ గురుకుల పాఠశాలలో 15 మంది కరోనా పాజిటివ్ నిర్దారణ కావడం ఆందోళన కల్గిస్తొంది. మహబూబాబాద్ జిల్లో కేంద్రంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు కరోనా సోకింది.

Advertisements
15 students got corona positive in mahabubabad tribal welfare boys gurukul school

 

పాత కలెక్టరేట్ సమీపంలోని ట్రైబల్ వెల్పేర్ బాలుర పాఠశాలలో విద్యార్ధులు జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 15 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరికి వసతి గృహంలోనే ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్ధులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు భయాందళనకు గురవుతున్నారు. మిగతా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లడానికి పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు.

Advertisements
15 students got corona positive in mahabubabad tribal welfare boys gurukul school

 

దేశంలో గత 24 గంటల వ్యవధిలో అయిదు వేల కుపైగా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ 1,60,742 మందికి కరోనా పరీధలు నిర్వహించగా, 5,335 కొత్త కేసులు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 4,435 కేసులు నమోదు అయ్యాయి. కాగా , గత ఏడాది సెప్టెంబర్ 23 తర్వాత రోజువారి కోవిడ్ కేసులు 5వేల మార్కును దాటడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బూస్టర్ డోసులను అందించడంతో పాటు కరోనా పాజిటివ్ కేసులు ఉన్న పళంగా పెరుగుతున్న ప్రాంతాల్లో కాంటాక్టలను గుర్తించి టెస్టులు చేయాలని స్పష్టం చేసింది.

CM Jagan: ఇంటి వద్దే మంచానికి పరిమితమైన రోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!!


Share
Advertisements

Related posts

రాష్ట్రాలకు వాటా ఎగ్గొట్టడంపై కేంద్రం ఆలోచన ఏంటి…?

somaraju sharma

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

bharani jella

YS Sharmila : పార్టీ బిగ్ అప్డేట్ వచ్చేసింది..! షర్మిల పోటీ చేసే అసెంబ్లీ ఇదే ఫిక్స్..!!?

Yandamuri