టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Share

Telangana: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్న వారికి హైద్రాబాద్ నడిబొడ్డున అభంశుభం తెలియని బాలలపై జరిగిన కిరాతక దాడి గురించి బహుశా తెలియకపోవచ్చు.విచిత్రమేమిటంటే ఈ వార్తను తెలంగాణాలో ప్రముఖంగా ప్రచురించిన అగ్రశ్రేణి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దాని ఆ ఊసే ఎత్తలేదు.హైదరాబాద్ చరిత్రలోనే ఇది అత్యంత అమానవీయమైన సంఘటన ఇదేనని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Telangana:ఒకరు కాదు ఇద్దరు కాదు 16 మంది బాధితులు!

వేసవి సెలవులను సరదాగా గడుపుకొంటున్న పదహారు మంది బాలలు ముగ్గురు వ్యక్తుల వికృత క్రీడకు బలైపోయారు.వీరంతా ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల వయసులోపు కలిగిన వారే.హైద్రాబాద్ నడిబొడ్డున ఉన్న మంగళ్ హాట్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.గుఫా నగర్ కు చెందిన పదహారు మంది బాలలు ఒకచోట ఆడుకుంటుండగా వారి వద్దకు ఒక ఆటో వచ్చి ఆగింది.అందులో ఉన్న వ్యక్తి నల్లగుట్ట దగ్గర ఆడుకోండి.మిమ్మల్ని అక్కడ కు తీసుకువెళ్తానంటూ వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు.

సీన్ కట్ చేస్తే!

ఆ బాలలు అక్కడికి వెళ్లేసరికి అప్పటికే నల్ల గుట్టపై ఆమోజ్(18),రాహుల్ (19)మరో బాలుడు ఉన్నారు.ఆ బాలలు అక్కడికి చేరుకోగానే వారిని బెదిరించి బట్టలు ఊడదీయించి కర్రలతో చితకబాదారు.అదంతా వీడియో కూడా తీశారు.ఇది ఎవరికైనా చెప్తే మళ్ళీ తీసుకొచ్చి కొడతామని బెదిరించడంతో బాలలు బెదిరిపోయి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు.అయితే ఒక్కరోజు కొందరు పిల్లల తల్లిదండ్రులు వారి ఒంటిపై ఉన్న గాయాలను గమనించి గట్టిగా అడిగితే అసలు విషయం వెలుగుచూసింది.

 

పోలీసులకు ఫిర్యాదు చేసినా?

వెంటనే ఆరుగురు బాలల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తొలుత కొద్దిగా హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత మెత్తబడిపోయారు.నిందితులను అదుపులోకి తీసుకొని రొటీన్ విచారణ జరిపి పంపేశారు.పోలీసులు అకస్మాత్తుగా తమ వైఖరి మార్చుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సమాచారం.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీఏ కు సన్నిహితుడైన ఒక వ్యక్తి వద్ద ప్రధాన నిందితుడు ఆమోజ్ పనిచేస్తాడని,ఆ పరపతి కారణంగానే ఈ కేసును పోలీసులు పక్కనబెట్టారని బాధితుల తల్లిదండ్రులు చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ప్రభుత్వ పరంగా మాత్రం స్పందన శూన్యంగా ఉంది.ఆ బాధితుల గోడు ఎవరికి వినిపించడం లేదు!


Share

Related posts

ఎన్.టి.ఆర్ 30 నుంచి అదిరిపోయే అప్‌డేట్ .. ఎప్పటినుంచి సెట్స్ మీదైకి వస్తుందో చెప్పిన త్రివిక్రం ..!

GRK

KCR: నేడే సంచ‌ల‌న నిర్ణ‌యం… లాక్ డౌన్ పై తేల్చేయ‌నున్న కేసీఆర్‌?!

sridhar

వీర్రాజు ‘కాటమరాయుడు’కాపురం ఎలా ఉంటుందో ?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar