MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడుగా మంచు విష్ణు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నటి శ్రీనిజ అక్కడకు హంగామా హంగామా చేసి సీనియర్ నటుడు మోహన్ బాబుపై తీవ్ర స్థాయిలో దుర్బాషలాడటం తీవ్ర సంచలనం అయ్యింది. అయితే ఈ వ్యవహారాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ గా తీసుకున్నారు. శ్రీనిజపై మా అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నటి శ్రీనిజను మా నుండి బహిష్కరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మా శాశ్వత సభ్యత్వం నుండి నిరవధికంగా ఆమెను సస్పెండ్ చేశారు.
MAA: అసలు ఏమి జరిగింది..
పలు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లతో గుర్తింపు పొందిన నటి శ్రీనిజ డైవర్షన్ ఆంటీగా సోషల్ మీడియాలో పాపులర ్అయ్యారు. చాలా కాలం నుండి మా సభ్యురాలిగా ఉన్న ఆమె మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం రోజున వేదిక వద్దకు నానా హంగామా చేయడం, మోహన్ బాబు ను పేరు ఉశ్చరిస్తూ బూతులు తిట్టడం చేసింది. ఆ సమయంలో పోలీసులు వారించినా వినకుండా తీవ్ర స్థాయిలో రచ్చరచ్చ చేసింది. పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించిన తరువాత ఆమె అక్కడ నుండి వెళ్లారు. మోహన్ బాబును బండ బూతులు తిడుతుండటం, పోలీసులు ఆమెను వారించడం అక్కడ జరిగిన తతంగం అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
శ్రీనిజపై మా సీరియస్ యాక్షన్
ఆనాడు జరిగిన ఘటనపై మా అసోసియేషన్ సీనియర్ గా తీసుకుని గత నెలలో జరిగిన ఈసీ మీటింగ్ లోనే తీవ్ర చర్యలు చేపట్టింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మా ప్రతిష్టకు భంగం కల్గించేలా ప్రవర్తించినందుకు గత నెల 16వ తేదీన అసోసియేషన్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇచ్చిన సంజాయిషీకి సంతృప్తి చెందిన మా అసోసియేషన్ గత నెల 23వ తేదీన జరిగిన ఈసీ మీటింగ్ లో ఆమెను మా శాశ్వత సభ్యత్వం నుండి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే శ్రీనిజపై ఒకే సారి ఇంత కఠినమైన చర్య తీసుకోవడం పై మా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.