NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: సజల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Share

Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ .. గతంలో వాజ్ పేయి హయాంలో చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్ సరిగా వ్యవహించలేదని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలు అవుతాయని అన్నారు.

మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే

  • బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని హామీ
  • ధరణికి బదులుగా మీ భూమి యాప్
  • ప్రజలందరికీ సుపరిపాలన, సమర్ధవంతమైన పాలన
  • వెనుకబడిన వర్గాల సాధికారత,అందరికీ సమానమైన చట్టం వర్తింపు
  • కూడు – గూడు, అందరికీ ఆహార, నివాస భద్రత
  • రైతే రాజు అన్నదాతలకు అందలం
  • విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్ పుట్ అసిస్టెన్స్
  • మహిళలకు పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
  • మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్
  • యువశక్తి –ఉపాది..యూపీఎస్సీ తరహాలో గ్రూప్ -1, గ్రూప్ – 2 పరీక్షల నిర్వహణ
  • ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేస్తాం
  • వైద్య శ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10లక్షల ఆరోగ్య భీమా
  • గల్ప్ బాధితుల కోసం నోడల్ ఏజన్సీ
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
  • మండల కేంద్రాల్ల నోడల్ స్కూళ్ల ఏర్పాటు
  • వరికి రూ.3100 మద్దతు ధర
  • నిజామాబాద్ లో టర్మరిక్ సిటీ
  • అడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చే నాటికి రూ.2లక్షలు అందజేత
  • ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలెండర్లు ఉచితం
  • సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్ మెంట్
  • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
  • స్వయం సహాయక బృందాలకు ఒక్క శాతం వడ్డీతోనే రుణాలు
  • రైతులకు ఉచితంగా దేశీ ఆవులు
  • రైతులకు ఉచితంగా పీఎం పంటల భీమా
  • వయో వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు
  • ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు
  • మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు
  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ
  • బడ్జెట్ స్కూళ్లకు పన్ను మినహాయింపు
  • పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు
  • నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు
  • బీఆర్ఎస్ అవినీతిపై విచారణకు కమిటీ
  • ఎస్సీ వర్గీకరణ కు సహకారం

Share

Related posts

పెళ్లి  సమయం లో ప్రతి తల్లి తన కొడుకుతో చెప్పవలిసిన మాటలు !!

Kumar

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా..!!

sekhar

బోనమెత్తిన బిగ్ బాస్ అవినాష్

Varun G