Amit Shah: కాంగ్రెస్ పై అమిత్ షా సెటైర్ .. మరో 30 – 40 ఏళ్లు బీజేపీ హవానే అంటూ ధీమా

Share

Amit Shah:  బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ (Hyderabad)లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కనీసం పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుపుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ (Congress) ఉందంటూ వ్యంగ్యంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ తమ సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని అన్నారు షా.

Amit Shah slams congress

Read More: GHMC: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. రూ.20లక్షలు జరిమానా

కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ఓడిపోతామన్న భయంతోనే ఆ కుటుంబం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదని అమిత్ షా విమర్శించారు. కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు వెన్నెముక లేని రాజకీయాల వంటివి దేశానికి పట్టిన దరిద్రాలు అని అన్నారు. ఏళ్ల తరబడి దుస్థితికి ఇవే కారణమని అన్న అమిత్ షా .. వచ్చే 30 – 40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాలకు దారి చూపే విశ్వ గురువుగా భారత్ ఎదుగుతుందని అన్నారు అమిత్ షా.

Read More: Bandi Sanjay: సీఎం కేసిఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా నేతలు ఫైర్

సమావేశాల్లో అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక, అసొం సీఎంలు తీర్మానాన్ని బలపరిచారు. ఈ సందర్భంలో గుజరాత్ అల్లర్లలో మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలని తీర్మానం చేశారు.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

48 seconds ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago