NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం – అమిత్ షా

Advertisements
Share

Amit Shah: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకువద్దామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ అందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం పట్టణం నుండి ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించింది. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన రైతు గోస – బీజేపీ భరోసా భారీ బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న  అమిత్ షా.. తిరుపతి వెంకటేశ్వర స్వామికి,  స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారములు చెబుతూ ప్రసంగించారు.

Advertisements

తెలంగాణ విమోచన కోసం పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ 75 ఏళ్ల వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు చెప్పదలచుకున్నాను.. తెలంగాణలో అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తెలంగాణ విమోచన సంగ్రామంలో నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేశారు. కానీ మీరు తొమ్మిదేళ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ.. నాటి ప్రజల త్యాగాలకు విలువ లేకుండా చేశారని అన్నారు. ఖమ్మం ప్రజలారా… నా మాట గుర్తుంచుకోండి.. ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

భద్రాచలానికి దక్షిణ భారతపు అయోధ్యగా పేరుంది.. భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్త రామదాసు పడిన పాట్లు.. నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడు. అని అన్నారు. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. రామనమవి  నాడు..  ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది కానీ కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు.. భద్రాచలం వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోంది అని పేర్కొన్నారు. ఎందుకంటే.. మందిరంలోకి వెళ్తే మిత్రుడి (ఓవైసీ)కి బాధ కలుగుతుందనే ఆలోచన ఆయనది. కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. మీ పని అయిపోయింది అని అమిత్ షా అన్నారు. రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాద పద్మముల ముందు అర్పిస్తామనీ, కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదని అన్నారు. స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదని అన్నారు. నరేంద్ర మోడీ ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో ఎటువంటి  సందేహం లేదన్నారు.

బీజేపీ నేతల మీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే,  బెదిరింపులకు గురిచేస్తే.. వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారు. మా కిషన్ రెడ్డిని, బండి సంజయ్, ఈటెల లను అడ్డుకుంటే.. తాము వెనక్కు తగ్గమని అన్నారు. కేసీఆర్.. నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ..బీఆర్ఎస్ పార్టీ.. 2జీ పార్టీ.. మజ్లిస్ పార్టీ..3 జీ పార్టీ.. ఇప్పుడు ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లింది. తెలంగాణలో వచ్చేది మోడీజీ పార్టీయేనని అన్నారు. పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు, దళితులకు ఆర్థికంగా భరోసా ఇస్తానన్నాడు… రైతులకు మరో హామీ.. ఇలా అబద్ధపు హామీలు ఇస్తూ కాలం వెల్లదీస్తున్నాడు తప్ప పేదలకు కేసిఆర్ ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ మోదీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా28వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోదీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.

ధాన్యం సేకరణ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేదనీ, మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిందని చెప్పారు. బియ్యం మీద కనీస మద్దతు ధర 67 శాతం పెరిగిందని గుర్తు చేశారు. 11కోట్ల మంది రైతులకు 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందనీ, 10 వేల ఎఫ్ పీ ఓలను ఏర్పాటు చేసే పని మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయని ఖర్గే అబద్దాలు చెబుతున్నారన్నారు. కేసిఆర్ పక్కన ఓవైసీ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కేసీఆర్.. ఒవైసీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడైనా ఒవైసీతో కలుస్తుందా..అని ప్రశ్నించారు అమిత్ షా. బీఆర్ఎస్, ఓవైసీల రెండు పార్టీలతో బీజేపీ కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదనీ అలాంటిది వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన అర్థరహితమని అన్నారు. ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు అమిత్ షా.

Breaking: హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం .. ముగ్గురు సజీవ దహనం


Share
Advertisements

Related posts

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా

Special Bureau

చైనా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కెఏ పాల్..!!

sekhar

అతనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయండి

somaraju sharma