తెలంగాణ‌ న్యూస్

అమలుకాని కేసిఆర్ హామీలను ఎత్తి చూపి మరీ తూర్పారబట్టిన అమిత్ షా

Share

ఎన్నికల సమయంలో కేసిఆర్ హామీలు ఇచ్చి అమలు చేయని వాటిని ఎత్తి చూపుతూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పారబట్టారు. మునుగోడు బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా ముందుగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నికతో శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కోమటిరెడ్డి గెలిస్తే కేసిఆర్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానన్నాడు ఇచ్చారా..? దళితుడిని సీఎం చేస్తానన్నాడు చేశాడా..? దళిత బంధు పథకం కింద పది లక్షల చొప్పున ఇస్తానన్నాడు, ఇచ్చారా..? ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చారా..? అంటూ ఇలా కేసిఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నించారు అమిత్ షా.

 

కేసిఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబానికే ఉపాధి కల్పించారని, మళ్లీ టిఆర్ఎస్ వస్తే ఆయన స్థానంలో కేటిఆర్ వస్తారన్నారు. కేసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారిందని అమిత్ షా ఆరోపించారు. మోడీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రోల్ ధరలు తగ్గించినా కేసిఆర్ సర్కార్ తగ్గించలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసిఆర్ మాట తప్పారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా కోరారు. సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, నేతలు విజయశాంతి,. డీకే అరుణ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హజరైయ్యారు.

బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం కానున్న టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?


Share

Related posts

తెలంగాణ ఫలితం- ఏపీలో సైకిల్ జోరుకు బ్రేక్

Siva Prasad

Pawan Kalyan: RRR, బాహుబలి రేంజ్ లో పవన్ సినిమా..??

sekhar

నాగ శౌర్య సినిమాలో రకుల్ ప్రీత్ .. డామినేట్ చేస్తుందంటున్న ఫ్యాన్స్ ..?

GRK