Telangana Election: బీఆర్ఎస్ అచ్చంపేట అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరో సారి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి మట్టిపెడ్డతో దాడి చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే శనివారం అర్ధరాత్రి అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో బాలరాజు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. నాడు అచ్చంపేట లో ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందురు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో మంత్రులు కేటిఆర్, హరీష్ రావు లు పరామర్శించారు. కాంగ్రెస్ అభ్యర్ధి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ గువ్వల బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎమ్మెల్యే బాలరాజుపై దాడే జరగలేదనీ, సానుభూతి కోసం డ్రామా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తొంది. కాగా, హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి ఆదివారం డిశార్జ్ అయిన బాలరాజు సోమవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తుండగా, అమ్రాబాద్ మండలంలోని కుమొరోనిపల్లి లో ఓ వ్యక్తి మట్టి పెడ్డలతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నిందితుడుని పోలీసులు పర్వతాలు అనే వ్యక్తిగా గుర్తించారు. పర్వతాలుకు మతిస్థిమితం లేదనీ, తరచూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులపై ఇలానే దాడులు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారని ఎస్ఐ వీరబాబు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తేలడంతో రాజకీయ దుమారానికి తావు లేకుండా అయింది.
BRS: సొంత గూటికి చేరిన తుల ఉమ .. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటిఆర్