Bandi Sanjay: సీఎం కేసిఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా నేతలు ఫైర్

Share

Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసిఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా పలువురు నేతలు ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సేల్స్ మెన్ అని అంటావా అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని అవమానించిన కేసిఆర్ ను ప్రజలు క్షమించరని అన్నారు. ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరు అంటే మోడీ అని సర్వేలు చెబుతున్నాయని, అటువంటి నాయకుడిని సేల్స్ మెన్ అని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా వ్యాధి వస్తే వ్యాక్సిన్ ఎక్కడి నుండి వస్తుందో అని ఎదురుచూసే పరిస్థితి ఉందని, కానీ ఇప్పుడు భారత దేశం వ్యాక్సిన్ అందిస్తున్న ధీమా ఇతర దేశాల్లో ఉందని అన్నారు. కేసిఆర్ ఏదేశానికి పోయారని ప్రశ్నించారు. సంచలన మాటలు మాట్లాడి దృష్టి మరల్చడం కాదని పేర్కొన్నారు.

Bandi Sanjay Fires on CM KCR

 

బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. రెండు సార్లు కూడా తెలంగాణ సెంటిమెంట్ వాడుకుని ముఖ్యమంత్రి అయ్యారనీ, ఎల్లకాలం సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదని అన్నారు. తెలంగాణలో బీజేపీ అదికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారం పోతుందన్న భయంతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రజలు టీఆర్ఎస్ ను సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేంద్రం నిధులు ఇస్తూ వస్తుందన్నారు. రాష్ట్రానికి వచ్చే అదాయంపై కేంద్రం పెత్తనం చేస్తుందా అని ప్రశ్నించారు. మరో నేత రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఏ దిశగా తీసుకుపోవాలనే దానిపై ఇక్కడ చర్చ జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Read More: Maharashtra: సెమీ ఫైనల్స్ లో శిందే విజయం .. మహా అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే, ప్రధాని మోడీ తో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హజరైయ్యారు. ఈ సందర్భంలో బీజేపీ నాయకులు.. కేసిఆర్ లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేస్తుండగా, కేసిఆర్ సహా ఆ పార్టీ మంత్రులు కేంద్ర బీజేపీ విదానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

22 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago