తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: మోడీ.. కేసిఆర్‌ను జైలుకు పంపబోతున్నారు..? ఫ్రూఫ్ ఇదే..??

Share

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కినా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ పైకి మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అంతర్గతంగా థర్డ్ ఫ్రంట్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని టాక్. కొద్ది రోజుల క్రితమే తమిళనాడులో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తాజాగా ప్రగతిభవన్ లో కేసిఆర్ ను ఆర్జేడీ నాయకుడు, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ నిన్న కేసిఆర్ తో సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే విధంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ పరార్, సీపీఐ జాతీయ నేతలు డీ రాజా, పార్లమెంటరీ నేత ఎంపి బినయ్ విశ్వం తదితర వామపక్షాల నేతలు రీసెంట్ గా హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో మర్యాదపూర్వకంగా కేసిఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Bandi Sanjay serious comments on kcr
Bandi Sanjay serious comments on kcr

Read More: Pawan Kalyan: పొత్తుల అంశంపై ఒక్క మాటలో తేల్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్..ఎవరి మైండ్ గేమ్‌లో పడవద్దంటూ నేతలకు కీలక సూచన..

Bandi Sanjay: సానుభూతి కోసం కేసిఆర్ ప్రయత్నాలు

ఈ పరిణామాలు అన్నీ గమనించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..కేసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం సీరియస్ గా ఉందని పేర్కొన్న బండి సంజయ్..ఇప్పటికే కేసిఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందన్నారు. ఎప్పుడైనా కేసిఆర్ జైలుకు వెళ్లొచ్చు అని వ్యాఖ్యానించారు. ఆ విషయం కేసిఆర్ కు తెలిసిందనీ, అందుకే కమ్యూనిస్టులతో, విపక్ష నేతలతో భేటీ అవుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం జైలుకు పంపితే సానుభూతి కోసం కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఫ్రంట్ లేదు..టెంట్ లేదు..దోచుకోవడం, దాచుకోవడమే కేసిఆర్ పని అంటూ విమర్శించారు బండి సంజయ్.

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేసిఆర్ సర్కార్ జారీ చేసిన జీవో నెం.317ని సవరించాలని బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను ఇటీవల పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్ పై బయటకి వచ్చిన బండి సంజయ్.. కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


Share

Related posts

Phone: ఫోన్ ఈ  విధంగా వాడితే ఏమవుతుందో  తెలుసా ?? ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోండి !!

siddhu

Problems: ఉదయం నిద్ర లేవగానే వీటిని చూశారంటే సమస్యలు తప్పవు !!

siddhu

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇదిగో….?

arun kanna