Bandi Sanjay: బండి సంజ‌య్ వ‌ర్సెస్ టీర్ఎస్ ఎమ్మెల్యే… ర‌చ్చ ర‌చ్చ‌.

Share

Bandi Sanjay:  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు విమ‌ర్శ‌ల ప‌రంప‌ర హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం కార్య‌క్ర‌మాల్లో మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గాయ‌ల‌పాల‌య్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరిలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల నడుమ ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బీజేపీ కార్పోరేటర్ శ్రవణ్ తలకు గాయమైంది. అక్కడ ఉన్న కార్యకర్తలు వెంటనే శ్రావణ్ ని దవాఖానాకు తరలించారు. టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీజేపీ పేర్కొంటుండ‌గా… త‌మ‌కేం సంబంధం లేద‌ని అధికార పార్టీ అంటోంది. దీనిపైనే మాట‌ల యుద్ధం పెద్ద ఎత్తున జ‌రిగింది.

 

Read More: Bandi Sanjay: పాద‌యాత్ర గురించి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు
బీజేపీ కార్పోరేటర్ శ్రవణ్ తలకు గాయం సమాచారం అందుకున్న బండి సంజయ్ శ్రావణ్ ని పరామర్శించారు. మైనంపల్లి కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరులైన టీఆరెస్ నాయకులు తనపై దాడిచేసారని బీజేపి నాయకులకు కార్పొరేట‌ర్ తెలియజేశారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి చాలా నీచమైన వ్యక్తి, గూండాయిజం, దాడులతో రాజకీయం చేస్తుండు. బీజేపీలో చేరదామని వస్తే మేం తరిమికొట్టినం. ఆలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు. ఖబర్దార్ మైనంపల్లి. నువ్వు పైసలతో, గూండాయిజంతో రాజకీయం చేస్తున్నావ్. మేము పార్టీ జెండాలతో పోరాడుతున్నాం. నీ ప్రభుత్వం, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు…రేపటి నుండి నీ సంగతి చూస్తాం. నీ అక్రమాలను బయటపెడతాం.. నీ రౌడీయిజాన్ని తొక్కిపడేస్తాం..’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై తక్షణమే డీజీపీ స్పందించాలి, మైనంపల్లి సహా టీఆరెస్ గూండాలపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామని ఆయన హెచ్చరించారు.

Read More: Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక‌… ఇప్ప‌ట్లో లేన‌ట్లే

మైనంప‌ల్లి త‌గ్గ‌లేదు…
బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే మైనంపల్లి ఘాటుగా సమాధానమిచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే బండి సంజయ్.. నీ గుండు పగలగొడతా.. త్వరలోనే నీ రాసలీలలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతా అని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని హెచ్చరించారు. మల్కాజ్ గిరి కార్పోరేటర్ శ్రావణ్ మీద టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని.. కావాలనే ఘర్షణ సృష్టించి బండి సంజయ్ రాద్ధాంతం చేద్దామని చూస్తున్నాడని మైనంపల్లి అన్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో చిచ్చు పెడుదామనుకుంటున్నావేమో అది జరగనివ్వను. మల్కాజ్ గిరిలో నువ్వు కాలు కూడా పెట్టలేవ్ అని హెచ్చరించారు.


Share

Related posts

ఏపి హైకోర్టు ‘సిజె‌’గా జస్టిస్ మహేశ్వరి

somaraju sharma

కేసీఆర్‌ని సుప్రీంకి లాగుతున్న రేవంత్ రెడ్డి..!!

Special Bureau

కర్ణాటకలో 2వేల కోట్ల కరోనా స్కామ్..! నిజమేనా?

Muraliak