NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Basara IIIT: మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినా.. వర్షంలోనూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి జోరున వర్షం కురిసినా విద్యార్ధులు ఆందోళన విరమించలేదు. గొడుగులు వెసుకుని మరీ క్యాంపస్ మెయిన్ గేటు వద్ద భైటాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. క్యాంపస్ లోని సమస్యలపై ప్రతి ఏటా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తుండటం దానిపై అధికారులు సముదాయించడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుండి విద్యార్ధులు ఆందోళనకు దిగారు. బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ నియమించాలని, క్యాంపస్ లో సమస్యలను పరిష్కరించాలని ఇలా మొత్తం 12 డిమాండ్లతో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ విద్యార్ధులతో చర్చించారు. తమ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామనీ, మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ విద్యార్ధులు తమ ఆందోళనను కొనసాగించారు.

Basara IIIT Student agitation
Basara IIIT Student agitation

 

రాత్రి వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని మరీ తమ ఆందోళనను కొనసాగించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ విద్యార్ధులు డిమాండ్ లలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. బెంచీలు, పంబ్లింగ్, యూనిఫామ్ వంటి వాటి కోసం విద్యార్ధులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదనీ వాటిని సమకూర్చడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. కోవిడ్ మూలంగా విద్యా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిందనీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ అంశం పిల్లలు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలు ఎక్కడ చేయాలో అక్కడ చెద్దామనీ, పిల్లలను ప్రశాంతంగా ఉండనీయాలని అన్నారు.

 

సమస్యలు ఏమైనా ఉంటే ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా ఆందోళనలకు దిగవద్దని సూచించారు. విద్యార్ధులు తమ కేరీర్ పై దృష్టి పెట్టి రేపటి నుండి తరగతులకు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరో ఏదో చెప్పారని బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠను చెడగొట్టవద్దని మంత్రి సబితా కోరారు. విద్యార్ధుల డిమాండ్ల పై మంత్రి అధికారులతో సమీక్షించారు. విద్యార్ధులతో చర్చించి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఆదేశించారు. మరో పక్క విద్యార్ధుల ఆందోళనపై ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను సీఎం కేసిఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి కేటిఆర్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!