ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సముద్రాల మానస (22) ప్రైవేటు హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. నిన్న సాయంత్రం కాలుతున్న వాసన రావడంతో హాస్టల్ నిర్వహకులు, తోటి విద్యార్ధులు వచ్చి చూడగా మానస గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే మానస మంటల్లో కాలిపోతూ కనిపించింది. వెంటనే మంటలను ఆర్పి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. హస్టల్ నిర్వహకుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానస స్వస్థలం వరంగల్ గా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మానస కళాశాల హాస్టల్ లో ఉండకుండా, కాలేజీ ఎదురుగా ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మానస స్వయంగా ఓ పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ కొనుక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. హాస్టల్ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఇటీవలే మానస తండ్రి మరణించారు. అప్పటి నుండి ఆయనను తలుచుకుంటూ బాధపడేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?