తెలంగాణ‌ న్యూస్

Big Breaking: వైఎస్ షర్మిల అరెస్టు..! బేగంపేట పీఎస్ కు తరలింపు..! ఎందుకంటే..?

Share

Big Breaking: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ట్యాంక్ బండ్ పై నేడు నిరాహర దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని షర్మిల భావించినా పోలీసులు ఒక్క రోజుకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఉదయం నుండి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేసిన షర్మిల సాయంత్రం దీక్ష విరమించి ట్యాంకు బండ్ నుండి లోటస్ పాండ్ కు పాదయాత్రగా బయలుదేరారు. అయితే పాదయాత్రకు పోలీసు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు షర్మిలకు తెలియజేశారు.

Big Breaking: ys sharmila arrest
Big Breaking: ys sharmila arrest

అయితే తాము శాంతియుతంగా పాదయాత్రగా లోటస్ పాండ్ కు వెళతామంటూ పట్టుబట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అబిమానులతో ఆమె పాదయాత్రగా వెళుతుండగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నిలువరించారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్దివాదం జరిగింది. ఈ సమయంలో షర్మిల స్పృహ తప్పిపడిపోయారు. ఈ క్రమంలోనే షర్మిలను పోలీస్ వాహనం ఎక్కించి బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహార దీక్షలో వైఎస్ షర్మిలతో పాటు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.


Share

Related posts

PAVAN KALYAN: పాత పొత్తు కొత్త ఎత్తు.. పవన్ కళ్యాణ్ మాటలు విన్నారా..!?

Srinivas Manem

స్థానిక ఎన్నికలు:కోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

somaraju sharma

YSRCP MLC ; జగన్ మనసులో ఎవరున్నారో..!? స్థానాలు ఆరు – పోటీ పదహారు..!

Srinivas Manem