Biliti Electric: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంగా వాహనదారుల సౌలభ్యం కోసం ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తూ అన్నాయి. దీంతో వాహనచోదకులు కూడా వీటిపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ తరుణంలో కాలిఫోర్నియాకు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ఇంక్ (బిలిటి) కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామిక వాడలో 13.5 ఎకరాల్లో ఈ కంపెనీ రూ.1.144 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఏటా 2.4 లక్షల విద్యుత్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పే ఈ ఫ్యాక్టరీ ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుంది.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Biliti Electric: బిలిటి తమ సంస్థ విస్తరణలో భాగంగా
జపాన్, యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఫోర్చుగల్, జర్మనీ, లెబనాన్, ఉగాండా, కెన్యా, సెనెగల్, నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమలు ఉన్న బిలిటి తమ సంస్థ విస్తరణలో భాగంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి తెలంగాణను ఎంచుకుంది. సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ కు మంగళవారం తెలియజేయగా, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటిఆర్ స్వాగతించారు. సంస్థకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన గాయమ్ మోటార్ వర్క్స్ (జీఎండబ్ల్యు) భాగస్వామ్యంతో ఈ సంస్థ పని చేస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Biliti Electric: మంత్రి కేటిఆర్ హర్షం
ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ..బిలిటీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ వాహనాల (ఈవీ) రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడి అని, ఈ రంగంలో తెలంగాణ మరింత వేగంగా ముందుకెళ్లేందుకు ఇది సహకరిస్తుందని తెలిపారు. ఇటీవలే అమెరికాకు చెందిన ఈవీ సంస్థ ఫిస్కర్ తన యూఎస్ పర్యటనలో కుదిరిన ఒప్పందం మేరకు హైదరాబాద్ లో రెండో ప్రధాన కార్యాలయం ఏర్పాటునకు సన్నాహాలు ప్రారంభించడం శుభపరిణామమని కేటిఆర్ అన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
2024లో వాహనాల ఉత్పత్తి
బిలిటీ ఎలక్ట్రిక్ సీఈఓ రాహుల్ గాయమ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ వాహనాల విధానం ఎంతో ఆకర్షనీయంగా ఉందని, మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాల ప్రపంచ స్థాయి కేంద్రం (హబ్) మార్చడంలో తాము భాగస్వామలం కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2023లో నిర్మాణాన్ని పూర్తి చేసి 2024లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. కార్గో మోడల్ టాస్క్ మ్యాన్, ప్యాసింజర్ వెర్షన్ అర్బన్ పేర్ల పై త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తామని రాహుల్ చెప్పారు.
Madhavi Latha: ఆ ఇష్యూ పై మాధవి లత సంచలన కామెంట్స్ …!