NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాషాయం దూసుకొస్తోంది!! మీడియా వైపు నుంచి స్టార్ట్

 

 

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టిఆర్పి రేటింగ్ ఉండే టీవీ9 చైర్మన్ మై హోమ్ రామేశ్వరరావు త్వరలో బీజేపీ లోకి రాబోతున్నారు అనేది కీలకమైన వార్త. తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన… టీవీ9 నుంచి రవిప్రకాష్ ను బయటకు పంపేసాక పూర్తిగా టీవీ9 తెరాస వార్తలు మీద ఎక్కువ దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. మరోపక్క హిందూత్వం విషయంలోనూ పలు హోమాలు యాగాలు చేస్తారు అని పేరున్న రాజేశ్వరరావుకు చిన్న జీయర్ స్వామి వద్ద మంచి పరిచయాలు, సాన్నిహిత్యం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మై హోమ్ రామేశ్వరరావు త్వరలోనే కండువా ఒప్పుకున్నారని ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది అనేది రాజకీయ సర్కిళ్లలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న వార్త. ఎప్పటి వరకు మై హోమ్ రామేశ్వరరావు వైపునుంచి దీని మీద ఖండన గాని దీన్ని వ్యతిరేకిస్తూ గాని ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా నాటుకు పోవాలని పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్న కాషాయ పార్టీ… తాను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలంటే మీడియా దన్ను అత్యంత అవసరమని భావిస్తోంది. దీనికి తగినట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టీఆర్పీ ఉన్న టీవీ9 చైర్మన్ రామేశ్వరము పార్టీలోకి తీసుకుని టీవీ 9 ను పూర్తిగా బిజెపి తమ చెప్పుచేతల్లో కి తీసుకోవాలనేది ప్లాన్. దీనికి ఇప్పటికే అంతర్గతంగా కొన్ని చర్చలు జరిగాయని మై హోమ్ రామేశ్వర సైతం దీనికి ఒప్పుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రాజ్ ఉన్నా… క్లిక్ కావడంలేదు!!

టీవీ 9 నుంచి బయటకు వచ్చాక రవి ప్రకాష్ పలు మార్గాల ద్వారా మీడియాలో పోటీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వాటిలో ఎక్కువ శాతం ఆయనకు ఎక్కడ సానుకూల వాతావరణం కనిపించలేదు. ఇటీవల రాజ్ న్యూస్ ను ఆయన టేకోవర్ చేసి ఆయన ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నారు. టీవీ9 ఛానల్ ను తన దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారని రఘు ప్రకాష్ మై హోమ్ రామేశ్వరరావు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మీద గుర్రుగా ఉన్నారు. దీన్ని బిజెపి చక్కగా వాడుకుంది. రవి ప్రకాష్ కు రాజ్ టీవీ పగ్గాలు అప్పగించడం లోను బీజేపీ నాయకుల పాత్ర ఉంది. ప్రతిరోజు మై హోమ్ రామేశ్వరరావు పై వివిధ కథల రూపంలో అక్కసు వెళ్లగక్కడం తో పాటు బీజేపీ కు అనుకూలంగాను రాజ్ న్యూస్ తెలంగాణలో పూర్తిస్థాయిలో పని చేస్తుంది. అయితే ఛానల్కు అనుకున్నంత పేరు టిఆర్పి రాకపోవడం ఆ చానల్లో వేస్తున్న వార్తలకు అంత ప్రాధాన్యం దక్కకపోవడంతో ఇప్పుడు బిజెపి ప్రధాన మీడియాను తన గుప్పిట్లోకి తీసుకోవాలని స్కెచ్ వేసింది. దీనిలో భాగంగానే టీవీ9 చైర్మన్ మై హోమ్ రామేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించాలని భావిస్తోంది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 పూర్తిగా బిజెపి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.


** మరోపక్క ఇటీవల మూతపడిన ఆంధ్రభూమి పత్రిక ను సైతం బిజెపి తిరిగి తన ఆధ్వర్యంలో నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డక్కన్ క్రానికల్ వెంకట్రామి రెడ్డికి చెందిన ఆంధ్రభూమి ని కరోనా సమయంలో మూసివేశారు. పత్రిక నడిపించు లేని పరిస్థితి రావడంతో కేవలం డక్కన్ క్రానికల్ మాత్రమే హైదరాబాద్ రీజియన్లో అందిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించిన ఆంధ్రభూమి దినపత్రిక ను తిరిగి తమ ఆధ్వర్యంలోని వ్యక్తుల ద్వారా నడిపిస్తే… ఇటు ప్రింట్ మీడియా పరంగా కూడా ప్రజల్లోకి తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలని ఇది బీజేపీ ప్లాన్. దీనికి అనుగుణంగానే పక్కాగా రాజకీయాలను చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ను మీడియా పరంగా కూడా తన సత్తా చూపి… వచ్చే ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా బిజెపి అక్క వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju