BJP: జేపి నడ్డా హైదరాబాద్ పర్యటనలో హైటెన్షన్.. నిరసన ర్యాలీ రద్దు

Share

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఉపాధ్యాయ బదిలీలు, నిరుద్యోగ సమస్యలపై బండి సంజయ్ దీక్ష చేపట్టగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం నుండి రాణిగంజ్ వరకు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద జేపి నడ్డాకు ఆ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, విజయశాంతి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం నడ్డా విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ, రామచంద్రరావు తదితరులతో సమావేశం నిర్వహించారు. తాము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సికింద్రాబాద్ వెళతామని, ప్రభుత్వ తన ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

BJP chief jp nadda hyderabad tour

 

శంషాబాద్ నుండి నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు, మరో వైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా శాంతి ర్యాలీ చేసి తీరుతామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి జేపి నడ్డా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిద్దామని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ర్యాలీని రద్దు చేసుకున్నారు. నియంత ప్రభుత్వపై పోరాటం కొనసాగుతుందనీ బీజేపీ నేతలు తెలిపారు. అనంతరం నడ్డా సికింద్రాబాద్ నుండి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago