JP Nadda: హైదరాబాద్ నడిబొడ్డులో..కేసిఆర్ కి వణుకు తెప్పించే ప్రకటన చేసిన జేపి నడ్డా..

Share

JP Nadda: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జివో 317కు వ్యతిరేకంగా దీక్ష చేస్తుండగా తెలంగాణ సర్కార్ అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా మంగళవారం రాత్రి సికింద్రాబాద్ లో తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా విచ్చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ర్యాలీని రద్దు చేసుకున్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జేపి నడ్డా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుబ్బాక, హూజారాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిని కేసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

bjp chief JP Nadda slams kcr
bjp chief JP Nadda slams kcr

JP Nadda: మానసిక స్ధితి దెబ్బతిన్నట్లు ఉంది

కేసిఆర్ చర్యలు చూస్తుంటే ఆయన మానసిక స్ధితి దెబ్బతిన్నట్లు ఉందని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు ఒక్క చుక్క ఇవ్వలేదన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసిఆర్ పాలన ఉందని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ ధర్మ యుద్ధం చేస్తోందని ఈ ధర్మాయుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకువెళతామన్నారు. దర్నా చౌక్ వద్ద ధర్నాలు వద్దని చెప్పిన టీఆర్ఎస్ నేతలే దర్నా చౌక్ లో నిరసనలు తెలిపారన్నారు. హుజూరాబాద్ రుచిని రాష్ట్రం మొత్తం చూపిస్తామని అన్నారు నడ్డా.

బండి సంజయ్ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్దం

బండి సంజయ్ ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్దమని నడ్డా అన్నారు. సంజయ్ అరెస్టుపై ఎన్ హెచ్ ఆర్ సీకి నివేదిస్తామనీ, సంజయ్ అరెస్టుపై అన్ని వేదికలతో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సంజయ్ అరెస్టుపై స్పీకర్ రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటారని నడ్డా అన్నారు. బీజేపీ కార్యాలయంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు బలవంతంగా చొచ్చుకుని వెళ్లి సంజయ్ పై చేయి చేసుకున్నారనీ, కార్యకర్తలపైనా లాఠీ చేశారని మండిపడ్డారు జేపి నడ్డా. బీజేపీ సైద్దాంతిక పార్టీ అని, వ్యక్తుల ఆధారంగా పని చేయదని నడ్డా స్పష్టం చేశారు.

Read More: 1.TDP: టీడీపీకి జేసి బ్రదర్స్ రాజీనామా..?

2.CM YS Jagan Delhi Tour: జగన్‌కు ఢిల్లీలో ఒకరిద్దరు కాదు ఆరుగురు కేంద్ర మంత్రులు చెప్పిన గుడ్ న్యూస్ ఇదే..? ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్..!!

3.AP Employees JAC: ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట..? సంక్రాంతి పండుగ తరువాత మరింత సీరియస్‌గా…


Share

Related posts

Budama Kayalu: రూపాయి ఖర్చు లేని ఈ కాయలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు పరార్..!!

bharani jella

గబ్బా లో అబ్బా అనిపించిన పంత్, గిల్..! అద్భుతమైన విజయానికి చివర్లో భారత్…!

arun kanna

RRR: ‘నాటు నాటు’ కాదు ఇప్పుడు రాబోయో థర్డ్ సంగిల్ మరో నాటు అంటున్నారు..

GRK