BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటెలకు అరుదైన గౌరవం .. ప్రసంగాన్ని అభినందించిన పీఎం మోడీ

Share

BJP Meeting: హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. కార్యవర్గ చర్చలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు లభించిన ఈటెలకు తెలంగాణ నుండి మాట్లాడే అవకాశం కల్గింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ అంశాలను ఈటల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించే పార్టీగా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈటల ప్రసంగించగా, ప్రధాని మోడీ, జేపి నడ్డా అభినందించారు. ప్రసంగానికి ముందు ఈటలతో అమిత్ షా, జేపి నడ్డా మాట్లాడారు.

  • BJP Meeting pm modi appreciation to etela rajender

    Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.

  • Follow us on facebook , Twitter , instagram and Googlenews

Read More: GHMC: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. రూ.20లక్షలు జరిమానా

BJP Meeting: కేసిఆర్ డ్రైవింగ్ సీట్ లో .. స్టీరింగ్ ఎంఐఎం చేతిలో

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ సమావేశాాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసిందని అన్నారు. బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ప్రజా ధనాన్ని ఫ్లెక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసిఆర్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని సెటైర్ వేశారు కిషన్ రెడ్డి.

Read More: Amit Shah: కాంగ్రెస్ పై అమిత్ షా సెటైర్ .. మరో 30- 40 ఏళ్లు బీజేపీ హవానే అంటూ ధీమా

 

ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ

బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువను ఇచ్చి బీజేపీ మద్దతు ఇచ్చిందని, అయితే ఆశలు, ఆకాంక్షలకు విరుద్దంగా తెలంగాణలో పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను సీఎం కేసిఆర్ గాలికి వదిలివేశారని దుయ్యబట్టారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేశారని పేర్కొన్న పీయూష్ గోయల్.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ లో పరిస్థితులపై సీనియర్ నాయకురాలు డీకే అరుణ కూడా ప్రసంగించారు.

 

Read More: Breaking: నుపూర్ శర్మ పై లుకౌట్ నోటీసు జారీ చేసిన కోల్ కతా పోలీసులు

సమావేశాల్లో తొలి రోజు (శనివారం) హజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాత్రి నోవాటెల్ హోటల్ లో బస చేశారు. తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో పాటు దక్షిణాదిన పార్టీ విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా జాతీయ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తొంది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు 350 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న శనివారం మొదటి రోజు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. పార్టీ బలోపేతంపై ప్రధాని మోడీ, అమిత్ షా లు ప్రసంగించారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

3 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

7 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

10 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago