పదో తరగతి ప్రశ్న పత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ జిల్లా శామీర్ పేట లోని ఆయన నివసానికి వెళ్లిన పోలీసులు 160 సీఆర్ పీసీ కింద నోటీసులు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ తో పాటు ఆయన పీఏలు రాజు, నరేంద్రలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అయితే పోలీసుల నోటీసులపై ఈటెల రాజేందర్ స్పందించారు. విచారణకు రావాలని పోలీసులు నుండి నోటీసులు అందాయని చెప్పారు. తొలుత తమ న్యాయవాదులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఈటెల .. శుక్రవారం విచారణ కు హజరు కావడం లేదని చెప్పారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల శుక్రవారం విచారణకు హజరు కాలేకపోతున్నాననీ, ఈ నెల 10వ తేదీ విచారణకు హజరు అవుతానని వరంగల్లు డీసీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
మరో వైపు ఈ కేసులో ప్రధాన ఆరోపణలతో అరెస్టు అయిన బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడంతో ఇవేళ ఉదయం కరీంనగర్ జైలు నుండి విడుదల అయ్యారు. ఈ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేయడం, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేయడంతో బీజేపీ, బీ ఆర్ఎ స్ వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో యుద్దం చేస్తున్నారు. కాగా ఈటెల రాజేందర్ సమాధానంపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Bandi Sanjay: ‘యతో ధర్మస్తతో జయః’ .. జైలు నుండి విడుదలైన తర్వాత బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్