NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

NTR – KCR: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్ .. సేమ్ టు సేమ్ ..! నాడు జెయింట్ కిల్లర్ చిత్తరంజన్ దాస్ .. నేడు కేవిఆర్

NTR – KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నాదెండ్ల బాస్కరరావు ఎపిసోడ్ నేపథ్యంలో పూర్తి పదవీ కాలం కాకముందే రెండేళ్లలోనే అసెంబ్లీని రద్దు చేసి 1985లో ముందస్తు ఎన్నికలకు సిద్దమైయ్యారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో మొదటి సారిగా అటు ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం నుండి ఇటు తెలంగాణలో కల్వకుర్తి నుండి రెండు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ పోటీ చేశారు. హిందూపురంలో విజయం సాధించిన ఎన్టీఆర్..కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ చేతిలో 3,468ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. ముఖ్యమంత్రి పైనే విజయం సాధించడంతో చిత్తరంజన్ దాస్ జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. రెండో స్థానంలో ఓటమి పాలైన ఎన్టీఆర్ ..మూడో సారి ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని సాధించలేకపోయారు. ఇప్పుడు కేసిఆర్ కూడా మొదటి సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. గజ్వేల్ నుండి గెలిచినా రెండో స్థానం కామారెడ్డి లో ఓటమి పాలైయ్యారు. ఎన్టీఆర్ మాదిరిగా మూడో సారి అధికారంలోకి రాలేకపోయారు.

ఇక్కడ కామారెడ్డి లో ముఖ్యమంత్రి కేసిఆర్, కాబోయే ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని ఓడించడంతో బీజేపీ అభ్యర్ధి  కాటిపల్లి వెంకట రమణారెడ్డి (కేవిఆర్)  రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. జెయింట్ కిల్లర్ పేరు తెచ్చుకున్నారు. అటు బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్ కామారెడ్డిలో గెలుపునకు తీవ్ర స్థాయిలో కృషి చేసినప్పటికీ లోకల్ నినాదం కేవిఆర్ కు ప్లస్ అయ్యింది. కేవిఆర్ తన ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు కేసిఆర్, రేవంత్ రెడ్డిలు ఎవరు గెలిచినా ఉప ఎన్నిక వస్తుందని, వాళ్లు నాన్ లోకల్, తాను లోకల్,  మీకు (ప్రజలకు) ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. కోడంగల్ డిపో నుండి వచ్చిన బస్సు మళ్లీ కొడంగల్ డిపోకు వెళ్లిపోతుంది. అలానే గజ్వేల్ డిపో నుండి బస్సు మళ్లీ ఆ డిపోకే వెళ్లిపోతుంది అన్నట్లుగా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పి విజయం సాధించారు. కేసిఆర్ పై 6,741 ఓట్లతో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై 11,736 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కే వెంకట రమణా రెడ్డి.

ఈ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ తో పాటు మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందనరావు లు ఒ పక్క పరాజయం పాలవ్వగా, ఉద్దండులైన కేసిఆర్, రేవంత్ రెడ్డిపై కేవీఆర్ విజయం సాధించి అసామాన్యుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విజయంతో ఏవరీ కేవిఆర్ ..ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి.. అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. వాస్తవానికి కాటిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్ర స్థాయి పేరొందిన నాయకుడు ఏమీ కాదు. వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయిన కేవిఆర్..2004 లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

2004 స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడుగా గెలిచారు. ఆ తర్వాత జడ్పీటీసీ సభ్యుడుగా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్ధిక తోడ్పాటు కూడా అందిస్తూ స్థానికుల మన్ననలు పొందుతూ వచ్చారు. ఎంపీటీసీ సభ్యుడుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాబోయే నేతను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికై సంచలన విజయం నమోదు చేసుకున్నారు.

Telangana Elections: గాంధీ భవన్ వద్ద టీడీపీ జెండాలతో తెలుగు తమ్ముళ్ల హడావుడి .. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటూ విజయసాయి సెటైర్

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju