NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Third List: బీజేపీ మూడవ జాబితా వచ్చేసిందోచ్ .. బాబూమోహన్ అలక తీరినట్లే(గా)..!

BJP Third List: సుదీర్ఘ కసరత్తు తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల మూడవ జాబితాను విడుదల చేసింది ఆ పార్టీ అధిష్టానం. మొత్తం 35 మందితో మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో పలువురు పార్టీ సీనియర్ నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. పార్టీ నేతల వైఖరిపై అసంతృప్తితో టికెట్ ఇచ్చినా తాను పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ కు పార్టీ అధిష్టానం ఈ లిస్ట్ లో టికెట్ కన్ఫర్మ్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం నుండి కృష్ణ యాదవ్ బరిలో దిగనున్నారు.

ఇటీవలే బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావులకు టికెట్లు దక్కలేదు. మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ లకు టికెట్ లు దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాసలో ఉన్నట్లు తెలుస్తొంది. మహిళా మోర్చా నుండి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడతో బీజేపీ మహిళా నేతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ.. అభ్యర్ధుల ఎంపికల్లోనూ బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

మొత్తం 119 స్థానాలకు గానూ మూడు విడతలుగా ఇప్పటి వరకూ 88 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఇందులో బీసీలకు 33 స్థానాలు, వెలమ ఆరు స్థానాలు, రెడ్డిలకు 24, ఎస్సీలు 13, ఎస్టీ లకు 9, బ్రాహ్మణులు, వైశ్య, నార్త్ ఇండియన్ అగర్వాల్ కు ఒకొక్కటి కేటాయించారు. జనసేనతో సీట్ల సర్దు బాటు తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించనున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయం కావటంతో వారి 9 నుండి 12 సీట్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది.

మూడవ జాబితాలోని అభ్యర్ధులు వీరే

మంచిర్యాల – వీరబల్లి రఘునాద్
ఆసిఫాబాద్ – ఆజ్మీరా ఆత్మారం నాయక్
బోధన్ – వీ మోహన్ రెడ్డి
బాన్సువాడ – ఎండ్ల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్ – కల్చారి దినేష్
మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్ – పంజా విజయ్ కుమార్
నారాయణ ఖేడ్ – జానేవాడే సంగప్ప
ఆందోల్ – బాబు మోహన్
జహీరాబాద్ – రామచంద్ర రాజ నర్సింహ
ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఎల్బీ నగర్ – సామా రంగారెడ్డి
రాజేంద్ర నగర్ – తోకల శ్రీనివాస రెడ్డి
చేవెళ్ల – కేఎస్ రత్నం
పరిగి – మారుతి కిరణ్
ముషీరాబాద్ – పూస రాజు
మలక్ పేట – సామిరెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్ పేట – క్రిష్ణాయాదవ్
జూబ్లీ హిల్స్ – ఎల్ దీపక్ రెడ్డి
సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
నారాయణ్ పేట – రతంగ్ పాండు రెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
మక్తల్ – జలంధర్ రెడ్డి
వనపర్తి – అశ్వద్ధామ రెడ్డి
అచ్చంపేట – దేవని సతీష్ మాదిగ
షాద్ నగర్ – అందే బాబయ్య
దేవరకొండ -కే లాలూ నాయక్
హుజూర్ నగర్ – చల్లా శ్రీలతా రెడ్డి
నల్గొండ – మాదగాని శ్రీనివాస గౌడ్
అలేరు – పడాల శ్రీనివాస్
పినపాక – పోడియం బాలరాజు
పాలేరు – నున్నా రవికుమార్
సత్తుపల్లి – రామలింగేశ్వర రావు

Rahul Gandhi: మేడిగడ్డ బ్యారేజ్ ను స్వయంగా పరిశీలించిన రాహుల్ గాంధీ .. కేసిఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!