NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసుల ఆకస్మిక తనిఖీలు .. ప్రయాణీకుల్లో అలజడి .. ఎందుకంటే..?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణీకుల్లో ఒక్క సారిగా అలజడి రేగింది. బళ్లారి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు డాగ్ స్క్వాడ్ తో చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఒక్క సారిగా పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని రైలులో అనువణువు తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణీకులు ఏమి జరుగుతుందో అర్ధం కాక ఆందోళనకు గురైయ్యారు. ఆ తర్వాత విషయం తెలిసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విషయం ఏమిటంటే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బళ్లారి ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని ఫోన్ చేశాడు. దీంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు డాగ్ స్క్వాడ్ తో రైలులో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో అది కేవలం బెదిరింపు కాలేనని తేలడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు ఉందని కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు.

Bomb Threatening call to ballari express Secunderabad

 

రెండు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో కూడా చెన్నై వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి ఫోన్ చేయడం, ఆ తర్వాత అధికారులు తనిఖీ చేయగా అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చిన ఓ ప్రయాణీకుడిని లోపలకు అనుమతించకపోవడంతో ఆ ఫ్లైట్ లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అధికారులు అతన్ని పట్టుకుని విచారించగా ఈ విషయం తెలిసింది. ఇటీవల కాలంలో విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం ఎక్కువ అయ్యింది. ఏది అసలు కాల్ లో, ఏది ఫేక్ కాల్ లో తెలియక పోలీసులు మాత్రం బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N