NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: బీజేపీ నేత బండి సంజయ్ కు ఊరట .. షరతులతో బెయిల్ మంజూరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హనుమకొండ కోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు నిన్న రాత్రి హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టులో హజరుపర్చగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ వెంటనే ఆయనను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ సందర్భంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇవేళ విచారణ జరిగింది. ప్రభుత్వం  తరపున న్యాయవాదులు బండి సంజయ్ బెయిల్ ను అపోజ్ చేస్తూ వాదనలు వినిపించారు.

bandi sanjay

 

ఈ కేసులో పోలీసులు అరెస్టు నిబంధనలు పాటించలేదనీ, కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారనీ, అరెస్టుకు ముందు నోటీసులు అందజేయలేదని బండి సంజయ్ తరపు న్యాయవాదులు సమర్ధవంతంగా వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం బండి సంజయ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ రూ.20వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కొద్ది సేపటిలో బెయిల్ పేపర్లు బండి సంజయ్ న్యాయవాదులకు అందనున్నాయి. బెయిల్ పేపర్లను కరీంనగర్ జైలులో సమర్పించిన తర్వాత అనంతరం బండి సంజయ్ జైలు నుండి విడుదల కానున్నారు. రేపు ఉదయం జైలు నుండి బండి సంజయ్ విడుదల కానున్నారు. బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టులో బండి సంజయ్ కి లభించని ఊరట .. విచారణ వాయిదా.. బెయిల్ పై కొనసాగుతున్న ఉత్కంఠ

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju