తెలంగాణ‌ న్యూస్

Breaking : జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటి ఎన్నికల్లో శీలం సుజాత విజయం

Share

Breaking : జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం సతీమణి సుజాత విజయం సాధించారు. జీహెచ్ డబ్ల్యుఎస్ ప్యానెల్ నుండి శీలం సుజాతతో పాటు డి సుశీల రెడ్డి, ఆదాల హిమబిందు రెడ్డి కూడా గెలుపొందారు. ఇంకా 12 మంది అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టి హనుమంతరావు, రవీంధ్రనాధ్ ప్యానెల్ లు పోటీలో పోటీలో ఉండగా పాలకమండలిలోని 15 పోస్టులకు ఎన్నికలు జరిగాయి.

Breaking : Seelam Sujatha wins Jubilee Hills Housing Society elections
Breaking : Seelam Sujatha wins Jubilee Hills Housing Society elections

నేడు జరిగిన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల పోలింగ్ లో 3,181 ఓట్లకు గానూ 1,757 ఓట్లు పోల్ అయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, సినీ హీరో వెంకటేష్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, ఏపి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, సినీ నటుడు శ్రీకాంత్, ఏపి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, దర్శకుడు త్రివిక్రమ్ తదితర ప్రముఖులు ఓటింగ్ వినియోగించుకున్నారు.


Share

Related posts

నిహారిక పెళ్లి కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్!

Teja

Puri Musings: పూరి మ్యూజింగ్స్ లో కొత్త టాపిక్ “వాట్ 3 వర్డ్స్” యాప్..!!

bharani jella

సెంటిమెంట్ పెట్టుకుంటే మహేష్ ని తట్టుకోలేరంతే ..?

GRK