NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్

Telangana Congress: ఎట్టకేలకు తెలంగాణలో తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెజార్టీ మార్కు దాటింది. 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవగా, ఒక సీపీఐ అభ్యర్ధి గెలిచారు. ఎన్నికల ప్రచార సభల్లోనే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ, బీఆర్ఎస్ చేసిన విమర్శలు ఇక్కడ ప్రస్తావనార్హం. అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్, కొనుగోలు చేసే పార్టీ బీఆర్ఎస్ అని బీజేపీ విమర్శించింది. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్)లో చేరిపోయారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు మాట్లాడుతూ ఉంటారు.

ఈ పార్టీ నాయకులను వేరే వారు విమర్శించాల్సిన పని లేకుండానే సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. తెలంగాణ ఎన్నికల్లో నేడు స్పష్టమైన ఆధిక్యత వచ్చినా సీఎల్పీ లీడర్ ఎంపిక విషయంలోనూ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలన చేస్తుండగా, ఎస్సీ కోటాలో తనకు ఇవ్వాలని కోరుతున్నారు మల్లు భట్టివిక్రమార్క. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ లేదా సీఎల్పీ లీడర్ లలో ఒకరిని సీఎం అభ్యర్ధిగా నిర్ణయించడం ఆనవాయితీగా వస్తొంది. ముఖ్యమంత్రి రేసులో ఈ ఇద్దరే కాకుండా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర సీనియర్ నేతలు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు.

Congress

కర్ణాటక ఎన్నికల ముందు వరకూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. టీడీపీ నుండి వచ్చిన నాయకుడి కింద తాము పని చేయాలా అన్నట్లుగా కూడా మాట్లాడారు. అసమ్మతి నేతల మీటింగ్ లు నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినా ఆయనను వ్యతిరేకించే పలువురు  సీనియర్ నేతలు సవ్యంగా అయిదేళ్లు పరిపాలన చేయనిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో  పూర్తి కాలం అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి గా పాలన సాగించిన వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంతకు ముందు కాసు బ్రహ్మానంద రెడ్డి మాత్రమే ఉన్నారు.

1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్లలో ముగ్గురు మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుండి 2009 వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి కాలం ముఖ్యమంత్రి గా పని చేయడంతో పాటు 2009లోనూ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అకాల మరణానంతరం కొణిజేటి రోశయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఇద్దరు మారారు. ఈ బ్యాక్ హిస్టరీ ఉండటంతో పాటు కాంగ్రెస్ పార్టీలో అరడజను మందికి పైగా సీనియర్ లు ముఖ్యమంత్రి పదవిని ఆశించే వారు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరు నెలలకు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారతారని, స్టేబుల్ గవర్నమెంట్ ఉండదని ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ఎందుకు కంటే..ఫలితాలు వచ్చి 48 గంటలు గడిచిందో లేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఆరు నెలలో, ఏడాదో.. మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్ యే అంటూ  సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం .. తన విజయోత్సవ ర్యాలీలో ఈ కామెంట్స్ చేశారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ వచ్చింది.. దాన్ని వారు కాపాడుకుంటారో లేదో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులు వస్తాయనే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు చర్చలు జరిపినట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి అయితే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్దంగా ఉన్నారని టాక్ నడుస్తొంది. చూడాలి కాబోయే ముఖ్యమంత్రి ఏ విధంగా నెట్టుకొస్తారో..! బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా ఇలా 64 మంది ఎమ్మెల్యేలతోనే కొనసాగితే ముఖ్యమంత్రి సీటు దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షేనని అంటున్నారు.

Telangana Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానికే .. ఏకవాక్య తీర్మానం ఆమోదించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju