TS News: ఐటీ సోదాలపై మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి నల్లమోతు బాస్కరరావు స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వేములపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ..ఐటీ అధికారుల సోదాలపై మీడియాతో మాట్లాడారు నల్లమోతు బాస్కరరావు.
ఐటీ అధికారులు తనను కలవలేదని ఎమ్మెల్యే నల్లమోతు బాస్కరరావు తెలిపారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని, రైస్ మిల్లర్లతో తనకు ఏమి సంబంధం లేదని చెప్పారు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. తనకు ఎలాంటి కంపెనీలు (పవర్ ప్లాంట్స్), అక్రమంగా డబ్బులు లేవని అన్నారు. పవర్ ప్లాంట్ లలో తనకు పెట్టుబడులు ఉన్నాయనీ ఎవరైనా మీడియా సోదరులు చూపిస్తే వారికే రాసి ఇస్తానని చెప్పారు.
తన ఇంటిపైకి ఐటీ అధికారులు రాలేదని తెలిపారు. రైస్ మిల్లులలో తనకు ఎలాంటి వాటాలు లేవని చెప్పారు భాస్కరరావు. తన నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు కావడంతో వారు ఇబ్బందులో ఉంటే సాయం చేస్తుంటాను తప్ప తనకు అక్రమ పెట్టుబడులు ఎక్కడా లేవని అన్నారు. కాగా, నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా రైస్ మిల్లుల్లో, హైదరాబాద్ లో పలు ఐటీ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో అభ్యర్ధులు బిజీబిజీ గా ఉన్న తరణంలో వరుసగా ఐటీ అధికారులు నిత్యం ఎక్కడో ఒక చోట సోదాలు జరుపుతుండటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
Raja Singh: సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు