లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమక్షంలో సర్పంచ్ కి క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. బీఆర్ఎస్ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ పెద్దల ఒత్తిడితో ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మానసిక క్షోభకు గురి చేసి చేసుంటే క్షమించాలి. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలి, జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా.. నేను తప్పు చేశానని భావిస్తే మహిళందరూ క్షమించాలి. అందరూ కలిసి పని చేయాలని అధిష్టానం సూచించింది అని మీడియా సాక్షిగా రాజయ్య క్షమాపణలు చెప్పారు. ఇదే క్రమంలో జానకీపురం అభివృద్ధికి పాటుపడతాననీ, అధిష్టానం ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు.

తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని సర్పంచ్ నవ్య మరో సారి పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాననీ, చిన్న పిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలన్నారు. మహిళలను ఎవరైనా వేధిస్తే భరతం పడతానని పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతోందనీ, ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ఎవరినైనా క్షమిస్తానన్నారు. మళ్లీ ఇదే తప్పు చేస్తే ఊరుకోననీ, మహిళలను వేధించే వెధవలు ఇప్పటికైనా మారాలని అని వ్యాఖ్యానించారు. తాటికొండ రాజయ్య తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఎం చేస్తారో మీడియా ముఖంగా చెప్పాలని నవ్య పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజయ్యను తాను గౌరవిస్తాననీ, ఆయన వల్లనే తాను సర్పంచ్ అయ్యానని తెలిపారు. పార్టీని ఒక కుటుంబంగా భావించాననీ, జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
కాగా ఎమ్మెల్యే రాజయ్య పై మహిళా కమిషన్ యాక్షన్ కు సిద్దమైంది. ఆయనపై జానకీ పురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారనీ, నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు మరో వైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. అయితే ఈ వివాదానికి బీఆర్ఎస్ పెద్దలు పుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల ఒత్తిడితో నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లినట్లు తెలుస్తొంది. అందుకే సర్పంచ్ దంపతులతో ఎమ్మెయ్యే రాజయ్య మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.
Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు