NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతికి నేతల సంతాపం

సికింద్రాబాద్ కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) మృతిపై తెలంగాణ సీఎం కేసిఆర్ సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన  బాధపడుతున్నారు. ఈ నెల 16న గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవేళ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రికి ఆయన ఇంటికి తరలించారు.

BRS MLA Sayanna Passed Away

 

బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన సాయన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కంట్రోన్మెంట్ నియోజకవర్గం నుండి సాయన్న అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 1994, 1999, 2004, 2014 లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. హుడా డైరెక్టర్ గా ఆరు సార్లు బాధ్యతలు నిర్వహించారు. 2015 లో టీటీడీ పాలకమండలి సభ్యుడుగా బాధ్యతలు సేవలు అందించారు. వీధి బాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. అయిదు సార్లు ఎమ్మెల్యగా గెలిచి అరుదైన ఘనత సాధించారని కేసిఆర్ అన్నారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవ చిరస్మరణీయం అని కొనియాడారు. సాయన్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం కేసిఆర్ ఓదార్చారు. సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, మల్లారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నీచ రాజకీయాలు అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju